యుగాల నుంచీ
చెరిగిపోని
కావ్యానికి జీవం పోసిన
బోయవాని కలానికి
నేనూ ప్రణమిల్లుతున్న..!
తరాలనుంచీ
తరిగిపోని కథనాలకి ప్రాణం నింపిన
ఐతిహాసిక బ్రహ్మకు
నేనూ నమస్కరిస్తున్న..!
కనీవినీ ఎరుగని
మలుపులతో కదిలిపోతున్న కమనీయ
కావ్యాన్ని
కళ్ళ ముందుంచిన కవివర్యునికి
నేనూ జేజేలు పలుకుతున్న..!
నవరసాలను మేళవించి
నవ నవోన్మేషంగా
పురుడు పోసిన.. మేధోప్రతిభకి
నేనూ తలవంచి నమస్కరిస్తున్న.!!
