నేనెవరు? – డా. సమ్మెట విజయ

నా కంటూ ఓ పేరు అమ్మా నాన్నా పెట్టినా
ఇప్పుడు మారిపోయింది
కాదు కాదు నన్ను మార్చేసింది

అవును నిజమేమో!
‘‘నీవు ఖాళీగా ఉంటావని’’
పదే పదే అనే ఈ మాటే నా పేరేమో!

నా జీవితం నన్నలా మార్చిందేమో
ఎందుకంటే ..
ఉదయాన్నే మంచం మీద దుప్పట్లు
అలాగే పడి ఉంటాయి
కప్పుకున్నది ఎవరైనా మడవాల్సింది నీవేనని
నీవు ఖాళీగా ఉంటావని
కాఫీలు, టిఫిన్లు అందించాక కప్పులు, ప్లేట్లు
నీకోసమే చూస్తుంటాయి
షింక్‌లో వేసి శుభ్రం చేస్తావని
ఎవరు తిన్నా తీయాల్సింది నీవేనని
నీవు ఖాళీగా ఉంటావని
స్నానాలు అయ్యాక తడి టవల్స్‌
నీకోసమే చూస్తుంటాయి ఆరవేయమని
ఎవరు తుడుచుకున్నా ఆరవేసేది నీవేనని
నీవు ఖాళీగా ఉంటావని…!

విడిచిన బట్టలు నిన్ను పదేపదే పిలుస్తుంటాయి
ఉతికి మడిచి, బీరువాలో పెట్టమని
ఎవరు విడిచిన బట్టలు అయినా
ఆ పని నీది మాత్రమేనని
నీవు ఖాళీగా ఉంటావని…!

అంతా బయటకి వెళ్ళాక
చెదురుమదురుగా ఉన్న ఇల్లు
సర్దాల్సింది కూడా నీవేనని
ఎవరికి ఏ వస్తువు కావాలన్న
అందించాల్సింది నీవేనని
నీవు ఖాళీగా ఉంటావని!
అందరి ఆకలి తీర్చాల్సింది
అడిగినన్నీ వండి వడ్డించేదీ నీవేనని
నీవు ఖాళీగా ఉంటావి…!

పిల్లల హోమ్‌ వర్క్స్‌ చేయిస్తూ
వెలుగుతున్న లైట్లు ఆర్పాల్సింది నీవే
నీవు ఖాళీగా ఉంటావని…!

తిరుగుతున్న ఫ్యాన్లు ఆగిపోయిన అలారం
పేరుకున్న దుమ్ము వాసనతో టాయిలెట్లు
ఎండిపోతున్న మొక్కలు
చూడాల్సింది నీవే
నీవు ఖాళీగా ఉంటావి…!

నిండుకున్న సరుకులు తినడానికి పండ్లు
కట్టాల్సిన బిల్లులు చూడాల్సింది నీవే
నీవు ఖాళీగా ఉన్నావని…!

ఎవరిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడమైనా
పేరెంట్స్‌ మీటింగ్స్‌, పేరంటాలు, పరామర్శలు
హాజరవ్వాల్సింది నీవే
నీవు ఖాళీగా ఉంటావని…!

ఇప్పుడు చెప్పండి నా పేరేంటో
‘‘నీవు ఖాళీగా ఉంటావని’’
బాగుంది కదూ కొత్తగా
మోసే బరువు కనపడదు
జీతం లేదు గుర్తింపు ఉండదు
గౌరవం ఎలానూ లేదు
ఈ పేరు చాల్లే అంటారు
అంతేగా !!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.