ట్రాన్స్‌ సాధికారతకి తొలి మెట్టు-కుటుంబం – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్‌ వ్యక్తులు అట్టడుగున ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చట్టం, సమాజంలో వ్యతిరేకత, వివక్ష, పితృస్వామ్యం లేదా మగస్వామ్యం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ట్రాన్స్‌ వ్యక్తులు తమ లైంగిక పరిస్థితిని గుర్తించినప్పటి నుండి భయం, సిగ్గు, వివక్ష, చిన్నచూపు వంటి భావాలు ఉచితంగా ఒక బంపర్‌ ఆఫర్‌లా వచ్చేస్తాయి. ఇవన్నీ మొదలయ్యేది కుటుంబంలోనే!

ట్రాన్స్‌ వుమెన్‌ నేపథ్యంలో చూస్తే, మగ పిల్లాడిగా పుట్టి, క్రమంగా ఇంటి పనులు చేయడం, (సామాజిక మూస పద్ధతుల ప్రకారం) మహిళల దుస్తులు ధరించడం, అలవాట్లు పెంచుకోవడం, వంట చేయడం, ఇల్లు ఊడ్చడం, ముగ్గులు వేయడం, ఆడవారితో ఎక్కువగా గడపడం, మగవారి పట్ల ఆకర్షణ ఉండటం వంటివి కనిపిస్తాయి. అయితే, మగస్వామ్యం ప్రకారం పుట్టిన మగపిల్లవాడు సంతానాన్ని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే వాడిగా గర్వంగా భావిస్తారు. ఆడవారి పట్ల వారి పనులు, బాధ్యతలు పెళ్లి, ఇంటి పని, పిల్లల్ని కనడం, వండి పెట్టడం వంటివి వారికే సొంతమైనవిగా చూస్తారు. జెండర్‌ బైనరీ మాత్రమే సరైనది అని భావించే సమాజంలో ట్రాన్స్‌ వ్యక్తులకు చోటు లేదు. వారిని అసహజంగా, ప్రకృతికి, సమాజానికి వ్యతిరేకమైనవారిగా భావిస్తారు. దీనిని అసాధారణంగా చూసి, కుటుంబ పరువుతో కలిపి, బంధువులు ఏమనుకుంటారో, సమాజానికి మొహం ఎలా చూపించాలి అని ఆలోచిస్తూ మొదలవుతుంది. భయం, సిగ్గు, చిన్నచూపు, హేళన, వివక్ష అన్నీ ఇంట్లోనే మొదలవుతాయి. చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే తల్లి లేదా తోబుట్టువులు అర్థం చేసుకుంటారు.
ఈ అసహజమైన ప్రవర్తనను, గుర్తింపును మార్చాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. డాక్టర్ల దగ్గరికి, మంత్రగాళ్ల దగ్గరికి తీసుకువెళ్లడం, బంధువులతో కౌన్సిలింగ్‌ చేయించడం, వేరే ఊరికి పంపేయడం, నైతిక పర్యవేక్షణ, నియంత్రణ చేపట్టడం జరుగుతుంది. ఇవి చాలా సాధారణమైన ట్రీట్‌మెంట్‌లు. వాస్తవానికి చాలా మందికి తరచూ దేహ సుద్ధి జరుగుతూనే ఉంటుంది. బాల్యంలో ప్రవర్తన చూసి కొందరు సరిచేసే ప్రయత్నాలు చేస్తారు. ఒకోసారి బాగా కొట్టడం, హింసించడం, బందించడం, కౌన్సెలింగ్‌ ఇప్పించడం చేస్తారు. కొన్ని సందర్భాలలో డాక్టర్లు పరీక్షలు చేయడం, మానసిక రోగంగా భావించి మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది. కుటుంబ పరువు, కులం పరువు ఏమవుతుందో అనే చాదస్తంతో కొందరు తల్లితండ్రులు ట్రాన్స్‌ వ్యక్తులుగా గుర్తింపు ఉన్న తమ పిల్లలకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇప్పించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ‘‘పెళ్లి చేస్తే వాడే సెట్‌ అవుతాడు’’ అని బలవంతపు పెళ్లిళ్లు జరగటం, తర్వాత వైవాహిక జీవితం మొత్తం దెబ్బతినటం. పంచాయతీలు, పోలీస్‌ కేసులు, గొడవలు, విడాకులవంటివి కూడా చాలా మంది ట్రాన్స్‌ వ్యక్తులు అనుభవించారు. ఏమి చెయ్యలేక భార్యని వదిలి పారిపోయిన వారు వున్నారు. అయితే వీటన్నిటికీ కారణం ఏంటి?
భయానికి కొందరు ఇంట్లో మగవారిలాగా ఉండడం, బయటికి వెళ్లగానే తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడం చేస్తారు. నిజానికి ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల జీవితాలు మొత్తం నటనే! సమాజం అనుకున్న విధంగా ప్రవర్తించాలి అనే భారం ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ప్రవర్తించు అనే వత్తిడి వారిపై ఎప్పుడూ ఉంటుంది. కొందరు ఇంట్లో వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తే, కొందరు దొంగగా ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటారు. వాస్తవానికి బయట చాలా ఆనందంగా ఉంటారు. బయట తమలాంటి వారిని చూసి ఎంతో సంతోషపడతారు. వారు ఆడవారిగా ఫీల్‌ అవుతూ మగవారిని చూడగానే సిగ్గుపడడం, ఇష్టపడడం వంటివి వ్యక్తపరుస్తూ ఉంటారు.
అయితే, కుటుంబంలో అందరూ ఆలా ఉండరు. మనది ప్రధానంగా పితృస్వామ్య సమాజం కాబట్టి, ఇంట్లో, కుటుంబంలో మగవారి పాత్ర, వారి నుండి ఉండే ఆశలు అన్నీ ఆ వ్యవస్థను కాపాడేలా ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి, మగపిల్లను కనాలి, ఆస్తులను, వారసత్వాన్ని భద్రపరచాలి. కుటుంబంలో తమ నాయకత్వం నిలబెట్టాలి. ట్రాన్స్‌ వ్యక్తులలో ట్రాన్స్‌ భావాలు బయటపడినప్పుడు తక్కువగా చేస్తూ, హేళన చేస్తూ, వారు మాట్లాడే ప్రతి పదంలో కించపరిచే మాటలు ఉంటాయి. ఆడవారిని తక్కువగా చూస్తారు కాబట్టే అవమానకరమైన పదజాలం వాడతారు. ఉదాహరణకు, ఆడంగి వాడా, చేతకాని వాడా, ఆడబట్ట వాడా అని.
నిజానికి తాము అనుకున్న జెండర్‌ను గుర్తించకుండా, స్వీకరించకుండా మూస పద్ధతిలో ‘‘వాడు’’, ‘‘మగవాడు’’, ‘‘ఒరేయ్‌’’ అని మాట్లాడితే ట్రాన్స్‌ వ్యక్తులకు చాలా బాధ కలిగిస్తుంది. ఎన్ని కొట్టినా భరిస్తారు కానీ, తమ జెండర్‌ గుర్తింపుకు భిన్నంగా మాటలాడినప్పుడు తీవ్ర బాధకు గురవుతారు. ట్రాన్స్‌ వ్యక్తులను కుటుంబంలో అందరికంటే బాగా అర్థం చేసుకునేది ఎవరంటే తల్లి. ఎన్నో పరిశోధనల ప్రకారం, చాలా కుటుంబాలలో తల్లి చాలా సహకరిస్తుంది. తండ్రితో పోలిస్తే మూసపద్ధతిలో పితృస్వామ్యంలో సమాజంలో ఉండే ఆశలు తల్లి నుండి రావు. తల్లికి అందరూ బిడ్డలు సమానమే. ఇప్పటికి క్వీర్‌ తల్లితండ్రులను మనం చూస్తే ఎక్కువ శాతం తల్లులే ఉంటారు. వారు చేసిన సహకారం ట్రాన్స్‌ వ్యక్తులకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కొందరు తోబుట్టువులు, ప్రత్యేకంగా అక్కలు లేదా చెల్లెళ్లు కూడా బాగా సహకరిస్తారు.
కొన్ని కుటుంబాలలో, ప్రత్యేకంగా ఆధిపత్య లేదా గొప్ప ఇంటి కుటుంబాలలో తల్లులు కూడా అర్థం చేసుకోరు. వారు కూడా బలవంతపరుస్తారు, బలాన్ని చూపెడతారు. దీనితో పాటు ఒకసారి అనేక గుర్తింపులు/ఇంటర్‌సెక్షనాలిటీలో చూస్తే, ఆధిపత్య కులాల్లో ఇటువంటివి స్వీకరించడం కష్టం, అరుదు. దళిత బహుజన వర్గాలలో ట్రాన్స్‌ పిల్లలను స్వీకరించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే వారు ఇప్పటికే అణచివేయబడిన వర్గానికి చెందినవారు కాబట్టి. శివశక్తి ట్రాన్స్‌ వర్గాలలో మనకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ వర్గంలో సామాజిక స్వీకరణ చాలా సులువుగా అవుతుంది, ఎందుకంటే సమాజం, మతం, దేవుడు అనే అనుసంధానాల వల్ల. ఆధిపత్య కులాల్లో ఇది అసలు వీలు కాదు. కుటుంబ పరువు, కులం పరువు ఏమవుతుందో అనే చాదస్తంతో కొందరు తల్లితండ్రులు ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు.
ఎక్కువ శాతం విజయవంతంగా ట్రాన్స్‌ గుర్తింపుతో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని, ఉద్యోగాలు చేసే వారికి తల్లిదో, లేదా తండ్రిదో, లేదా ఇద్దరి సహకారం తప్పకుండా ఉంటుంది. బయట వారు తమను ట్రాన్స్‌ వ్యక్తులుగా చూస్తే ఇంట్లో వారికి చెప్పేస్తారని, సామాజిక మాధ్యమాల్లో చూస్తే చెప్పేస్తారని, బెదిరిస్తారని ముసుగు ధరిస్తూ ఉంటారు. నిజానికి ముసుగు వేసుకొని సామాజిక మాధ్యమాల్లో చాలా స్వేచ్ఛతో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అలాగే తమ గుర్తింపును బహిరంగంగా చూపించలేనందుకు బాధ కూడా పడతారు. హెచ్‌ఐవి నివారణ ప్రాజెక్ట్‌లలో పని చేసేవారిలో ఇలా ఇంట్లో తెలియకుండా, బయట మాత్రం అదే గుర్తింపుతో ఎంతో ప్రభావితంగా పని చేసినవారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల %నIప% వ్యాప్తి తగ్గి దేశానికే చాలా మేలు జరిగింది. కానీ కొంత మంది ట్రాన్స్‌ వ్యక్తుల కుటుంబాలలో వారికి వారి సహచరుల ద్వారా, బంధువుల ద్వారా వారి గురించి తెలిసి ఎన్నో కుటుంబాలలో వివాదాలు జరిగాయి. తల్లితండ్రులకు తెలిసిందని కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
ఎన్నో అనౌపచారిక సందర్భాలలో, శిక్షణా కార్యక్రమాలలో ట్రాన్స్‌ వ్యక్తులు తమ అనుభవాలు పంచుకున్నారు. కుటుంబంలో వారిని స్వీకరించనప్పుడు వారు బయటికి పోయి, వలసపోయి, ఇంటికి ఊరికి దూరంగా ఉండి, చీరలు, చుడీదార్లు వేసుకొని వేరే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు వారి గురించి ఏ సమాచారం అవసరం లేదు. తామే సంప్రదిస్తే మాట్లాడవచ్చు లేదా మాట్లాడకపోవచ్చు. కానీ హిజ్రా వ్యవస్థలో ఉండి బస్తి, బాధాయి, బిక్షాటన చేసుకొని సంపాదించుకున్న తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు మాత్రం డబ్బు కోసం కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. అయితే, వారిని దగ్గరికి చేర్చుకుంటారని అనుకోవడం అపోహే! డబ్బు మాత్రమే స్వాగతం, తమ ట్రాన్స్‌ బిడ్డలు కాదు. మగవాడు చదువుతాడు, ఉద్యోగం చేస్తాడు, పెళ్లి చేసుకొని వారసులను ఇస్తాడు, కుటుంబ వంశాన్ని కాపాడతాడు అనే ఒక విశ్వాసం తల్లితండ్రులకు, కుటుంబానికి, బంధువులకు, సమాజానికి ఉంటుంది. దానికి భిన్నంగా ‘‘నేను మగవాడిని కాదు, ట్రాన్స్‌ లేదా ఆడవారిలా భావిస్తున్నా’’ అనగానే ముందు అనుకున్నవేవీ జరగవు కాబట్టి, మగవాడిలా తాను సంపాదించలేడు కాబట్టి, వంశ గౌరవం నిలబెట్టలేడు కాబట్టి, ఆర్థికంగా తమపై భారం అవుతాడేమో అని వారిని చేతకాని వారిలా పరిగణిస్తారు.
‘‘నా డబ్బు కావాలి, నా సంపన్నతతో ఇల్లు కడతారు కానీ నన్ను మగ పేరుతో సంభోధిస్తారు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది’’ అని ఒకరు, ‘‘గొప్పవాడివి అయ్యావు కానీ ఈ పొడవైన జుట్టుతో, చీర కట్టుకొని ఇంటికి రాకు. మా పరువు పోతుంది’’ అని ఒకరు, ‘‘డబ్బు పంపు బేటా, చెల్లె పెళ్లి ఉంది, పెళ్లికి రాకు రాత్రి వచ్చి కనబడు’’ అని ఒకరు, ‘‘నువ్వు వస్తే మన కులపోళ్ళు మాతో మాట్లాడరు. అక్క అత్తగారు కూడా అక్కను ఇంటికి పంపేస్తారు. నువ్వు రాకు’’ అని ఒకరు… ఇలా కొంత మంది ట్రాన్స్‌ వ్యక్తులు తమ అనుభవాలు పంచుకున్నారు.
ఇప్పుడు చట్ట రీత్యా ట్రాన్స్‌ వ్యక్తులుగా స్వలింగ సంపర్కులుగా ఉండడం నేరం కాదు కాబట్టి, కుటుంబం తమ ట్రాన్స్‌ పిల్లల్ని స్వీకరిస్తే ఇంకా ఎన్నో విజయాలు చూడవచ్చు. ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి, మానసిక అంతరాయాలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు. తల్లితండ్రులు సహకరించి తమ పిల్లను స్వీకరిస్తే చదువు, ఆ తర్వాత ఉద్యోగం, ఆ తర్వాత బంధువులు, ఆ తర్వాత సమాజం క్రమంగా అన్నీ మారతాయి. ఎవరు ఏమనుకుంటే ఏమిటి, మా బిడ్డ మాకు ముఖ్యం, మిగతావి అన్నీ అనవసరం అని తల్లితండ్రులు అనుకుంటే సమాజంలో ట్రాన్స్‌ వ్యక్తులకు ఎన్నో కఠినమైన పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. దీనితో పాటు హింస తగ్గుతుంది. మానసిక ఇబ్బందులు ఉండవు, నిస్సహాయతలు తగ్గుతాయి, చైతన్యవంతులు అవుతారు, సామాన్య సమూహంలో ఒకటి అవుతారు, సమాజం నుండి స్వీకారం పెరుగుతుంది, చిన్నచూపు తగ్గుతుంది, అవకాశాలు పెరుగుతాయి, ఎన్నో విజయాలు చూడవచ్చు. ట్రాన్స్‌ వ్యక్తుల సాధికారత మొదలయ్యేది కుటుంబం నుండే!

Share
This entry was posted in ప్రతిబింబం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.