గర్భసంచి మహిళలకి లైఫ్ లైన్ – పి. ప్రశాంతి

‘పండగలంటే పల్లెటూళ్ళలోనే చూడాలి. మరీ ముఖ్యంగా దసరా పండక్కి తెలంగాణా పల్లెల్లో రకరకాల పూలతో బతుకమ్మల్ని చేసి అందమైన ఆటపాటలతో సాగానంపడం చూడాల్సిందే. ఆంధ్రా పల్లెల్లో అయితే సంక్రాంతి పండక్కి నెల ముందునించే ముంగిళ్ళలో ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, హరిదాసులు…. చెప్పడం కాదు చూసి తీరాల్సిందే’ పరవశంగా చెప్పుకు పోతున్నాడు నరేంద్ర.

‘అవును! కోడి పందాలు, పేకాటలు, డాన్సు ప్రోగ్రాములు…. వాహ్…. పండగ మూడు రోజులైతే ముందు వెనకలు కలిపి కనీసం పది రోజులైనా ఎంత సందడిగా ఉండేది. ఆ రోజులే వేరు. ఇన్నాళ్ళకి మళ్ళీ చూడబోతున్నాం’ ఉత్సాహంగా అన్నాడు పవన్.
అప్పుడే లోపలికొచ్చిన చందుని చూస్తూ ఏదో అనబోయిన నరేంద్ర ఆ వెనక అతి నీరసంగా, దిగులుగా వచ్చిన రేఖని చూసి ఏమైందమ్మా అంటూ లేచి వచ్చాడు. బలవంతంగా ఏడుపు ఆపుకుంటున్నట్టున్న రేఖ తననే పరీక్షగా చూస్తూ దగ్గరకొచ్చిన పవన్‌ని పట్టుకుని ‘అన్నా..’ అంటూ ఏడ్చేసింది. ఏమైందన్నట్లు చూస్తున్న నరేంద్ర చేతిలో మెడికల్ రేపోర్ట్స్ ఫైల్ పెట్టాడు చందు. ‘గర్భసంచిలో నీటి బుడగలంట, ఒక్కటి కాదు.. కందిగింజ సైజు నుండి పెద్ద ఉసిరికాయ సైజు వరకు ఆరేడు ఉన్నాయంట. స్కానింగ్‌లో కనిపిస్తున్నాయి. వాటిలో ఏది ప్రమాదకరమైనదో చెప్పలేము, కేన్సర్‌కి కూడా దారితీయొచ్చు, ఒక్కటి పగిలినా ప్రాణానికే ముప్పు అంటున్నారు’ దిగులుగా చెప్పాడు చందు. ‘హుమ్మ్.. వెంటనే ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేయాలి, లేకపోతే ప్రమాదం.. వెంటనే డబ్బులు సమకూర్చుకోండి, ఆలస్యం చేస్తే మేమేం చేయలేము.. ఇంకా, అదీ.. ఇదీ.. ఏవేవో చెప్పుంటారు, అవునా’. తేలిగ్గా అంటున్న నరేంద్రని ‘ఏంట్రా ఆ మాటలు, వెటకారంగా ఉందా?’ అంటూ గదమాయించాడు పవన్.
‘పెళ్ళై అయిదేళ్ళన్నా కాలేదు, మొదట్లో మూడేళ్ళ వరకు పిల్లలు వద్దనుకున్నా గత రెండేళ్ళుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఇది తేలింది. ఇందుకే పిల్లలు కావట్లేదంట. ఎన్ని కలలు కన్నాం.. పెళ్ళికి అందర్నీ ఒప్పించి పట్టుపట్టి చేసుకున్నాం.. ఇందుకేనా అంటూ ఎన్ని మాటలంటారో.. గొడ్రాలంటూ ఎన్ని మాటలు పడాలో.. సారీ చందూ’ ఎక్కెక్కి ఏడుస్తున్న రేఖని పొదివి పట్టుకున్నాడు చందు. ‘అవన్నీ ఆలోచించకు రేఖా.. మనం పిల్లల్ని కనలేకపోతే ఏంటి? నాలోనే సమస్య ఉండుంటే ఏం చేసే వాళ్ళం.. అయినా మనకీ పిల్లలుంటారు.. దత్తత తీసుకుందాం.. ముందు నువ్వు ఏడవకు. నీ ఆరోగ్యంకన్నా నాకేదీ ముఖ్యం కాదు. నీ తర్వాతే పిల్లలైనా, ఎవరైనా..’ అంటున్న చందూని అభిమానంగా చూశాడు పవన్. ‘శభాష్.. మంచి మాట అన్నావు. అయినా మీరసలు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా?’ అడిగాడు నరేంద్ర. ‘ఒక్క హాస్పిటల్లోనే మూడు నాలుగు సార్లు కన్సల్టేషన్లని, రకరకాల టెస్టులకని, మందులకని.. ఇప్పటికే దాదాపు పదివేల వరకు ఖర్చు అయింది. ఇంక సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటూ హాస్పటల్స్ చుట్టూ రోజుల తరబడి తిరుగుతుంటే డబ్బుకి డబ్బు ఖర్చు, ఇద్దరికీ సెలవలు అయిపోయి శాలరీ కట్.. ఎవరు చెప్పినా ఒకటే చెప్తారుగా’ అంటున్న రేఖని, చందూని చూస్తూ ‘మీరు వార్తల్లో వినట్లేదా, పేపర్లల్లో చదవట్లేదా ఈ సిటీలల్లో ఎన్నిరకాల అవకతవకలు జరుగుతున్నాయో! ఎన్ని హాస్పటళ్ళు ఆరోగ్యాన్ని కేవలం వ్యాపారంగా చూస్తూ అనవసర ఆపారేషన్లు చేస్తున్నారో.. మీకు తెలియదా?’ అన్నాడు నరేంద్ర. వింటున్న పవన్ కూడా ‘నిజమే కదా! అయినా సెకండ్ ఒపీనియన్ తీసుకోడం చాలా ముఖ్యం, అందులోనూ శరీరంలోనించి ఒక కీలకమైన అవయవాన్ని తీసేయాలని చెప్పినప్పుడు ఇది మరీ ముఖ్యం. చదువుకున్న వాళ్ళమైనా ఆలోచించాలి కదా! ముందు మనం ఊరికి పోదాం పదండి. అక్కడ దగ్గర్లోనే మంచి పేరున్న గైనకాలజిస్ట్ ఉన్నారు. హాస్పటల్ పెట్టి ఐదారేళ్ళే అయినా మంచి వైద్యం చేస్తారని, డబ్బు మనిషి కాదని పేరు. ఈ మధ్య మనవాళ్ళంతా అవసరమైతే అక్కడికే వెళ్తున్నారు’ అన్నాడు.
ఇద్దరూ ఎలాగో బాస్‌లను ఒప్పించి పది రోజులు సెలవు పెట్టి ఊరికి చేరుకున్నారు. చాలా కాలం తర్వాత రేఖ, చందు అన్ని రోజులు ఉండటానికి వచ్చినందుకు రేఖ తల్లిదండ్రులు తబ్బిబ్బయ్యారు. అనుమానంగా చూస్తున్న నాయనమ్మతో పని ఒత్తిడి నుండి చందూకి బ్రేక్ కోసం, మన చుట్టుపక్కల చూడాల్సిన అన్నిటినీ చూపించేస్తాను అని హుషారుగా చెప్పి నాయనమ్మతో పాటు అందర్నీ నమ్మించింది రేఖ, అసలు విషయం చెప్తే పెద్ద రాద్దాంతం అవుతుందని. రెండో రోజు పవన్‌తో కలిసి హాస్పటల్‌కి వెళ్ళారు. దాదాపు గంటసేపు వెయిట్ చేశాక తమ వంతు వచ్చింది. అన్ని రిపోర్టులు చూసి, రేఖని పరీక్ష చేసి, ఇబ్బందులన్నీ అడిగి తెలుసుకుని ఆ సిస్టులు అంత ప్రమాదకరమైనవి కాదని మందులతో తగ్గిపోయే అవకాశం ఉందని డాక్టర్ అంటుంటే వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. డాక్టర్ నవ్వి ‘మీలాగే చాలామంది వచ్చారు, డాక్టర్లు అందరూ ఒకటి కాదు. మందులు రాసిస్తాను, వాడి ఫలితం ఉంటేనే మళ్ళీ రండి. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ వయసులో గర్భసంచి తీసేయడం ఏ మాత్రం మంచిది కాదు. అది కేవలం పిల్లల్ని కనడానికి కాదు, ఆడవాళ్ళ జీవితానికి అత్యంత కీలకమైనదని గుర్తుంచుకోండి’ అన్నారు. డాక్టరు గారి మాటలతో ఇద్దరి మనసులూ తేలికవ్వడమేకాక, రేఖకి నయమైపోతుందని, సమస్య త్వరలోనే తీరిపోతుందని గట్టి నమ్మకం కూడా కుదిరింది. ఇక పండగంతా గొప్ప ఉంత్సాహంగా గడిచిపోయింది.
క్రమం తప్పకుండా మందులు వాడడం, డాక్టర్ చెప్పిన సలహాలు, సూచనలు పాటించడంతో రేఖ శారీరక ఇబ్బందులు, పీరియడ్ సమస్యలు తగ్గిపోయాయి. ఆరునెలల తర్వాత మరోసారి స్కానింగ్ చేస్తున్నప్పుడు డాక్టర్ చందూని కూడా పిలిచి మోనిటర్‌లో చూపించారు. నీటిబుడగలు కుచించుకుపోయాయి. అది చూసి మొదట నమ్మలేక పోయారు. డాక్టర్ని సవాలక్ష ప్రశ్నలడిగి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాక మెల్లగా జీర్ణించుకుని డాక్టర్ కాళ్ళమీద పడినంత పని చేశారు. వారించి రేఖని అభిమానంగా ఆలింగనం చేసుకుని ‘అన్ని నీటిబుడగలు కేన్సర్ కారకాలు కాదని అర్ధమయ్యింది కదా! మీలాంటి చదువుకున్న వాళ్ళైనా ఇలాంటి పెద్ద పెద్ద విషయాల్లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని గుర్తించాలి, మీకు తెలిసిన అందరికీ ఈ విషయం చెప్పండి, కనీసం కొన్ని ప్రాణాలని కాపాడిన వారౌతారు’ అంటుంటే ఇందుకేనేమో మా నాయనమ్మ డాక్టర్లు దేవుళ్ళతో సమానం అంటుంది అని నమస్కారం పెట్టింది రేఖ.
‘ఇంకోటి గుర్తుపెట్టుకుని వీలైనంత మందికి చెప్పండి.. గర్భసంచి మహిళలకి ఒక వరం, అది కేవలం పిల్లల్ని కనడానికి కాదు, అది మహిళలకి ఒక జీవన రేఖ. అది తీసేయడం పెద్ద పని కాదు, కానీ పోగొట్టుకున్నాక తిరిగి రాదు, ఇంతవరకు ఇంకా గుండె, కిడ్నీ, లివర్ మార్పిడిలాగా గర్భసంచి మార్పిడి రాలేదు, దానిని కాపాడుకోడం ప్రాణాన్ని నిలుపుకోడంతో సమానం. నెలసరి సమస్యలు ఉండవనో, పూజలు పునస్కారాలకి అడ్డంకి కాకూడదనో, ఫీల్డ్ వర్క్, ఇంకా కొన్ని రకాల ఉద్యోగాల్లో ఉండే ఇబ్బందులకు పరిష్కారంగానో గర్భసంచీ తీయించుకోడం మన కంట్లో మన వేలుతోనే పొడుచుకున్నట్టని చెప్పండి. ఇదే మీరు నాకిచ్చే గౌరవం, సన్మానం’ అంటున్న డాక్టర్ చేతిలో చెయ్యేసి మాటిచ్చారు చందు, రేఖ.. గర్భసంచి మహిళలకి లైఫ్ లైన్ అని నమ్ముతున్నామని, ఇక మీదట ఈ ప్రచారం తమ జీవన విధానంలో భాగమవుతుందని.
ఇదే మాట నేనూ ఇస్తున్నాను.. మరి మీరూ..??

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.