మహాతల్లి – నిర్మలాదేవి.యన్

ఆమెకు ప్రపంచం పొగచూరిన చిత్రం
కాని,
ఆమెకు ప్రస్ఫుటమైన ‘అద్దమే’ ఆవశ్యకము, ఆధారం
అద్దంలో ప్రతి బింబము

ఒక్కసారి తెరిచిన సింధూర పెట్టెలా
మరుక్షణమే – !
మందార అధరాలు
సంధి ఋతువున వెలిసిన వర్ణాలై
చెంపల్లో వాడిన గులాబీ పూరేకుల
పరిమళాలలో వైఫల్యం దుర్గంధమై
నుదుట దీనంగా దిక్కులు చూస్తున్న’తిలకం’
తేట దర్పణంలో మసక బారిన రూపం
పెదవి విరిచింది నిస్తేజంగా……
తలుపు చెంత చిన్నారి.
అమ్మా అంటూ నిస్సహాయంగా…
ఏదో అర్థిస్తూ…
స్కూల్ ‘షూ’ లేవు కాబోలు
పాప కళ్ళల్లో తల్లి మణులు పొదిగిన పాదరక్షలు
చిట్టి నాన్న ‘యూనీఫాం’ లేక ఏడ్చి ఏడ్చి
ఎండిన కన్నీటి చారికలు…..
ఆమె జలతారు వలువ పట్టుజరీ
పరంపర మిల మిలలలో
జాలువారుతూ జలదరిస్తుంది.
చంకీలు పొదిగిన అద్దాల రవిక
మెరుపులు గాజు పెంకులై కుచ్చుకుంటున్నాయి

“ఎక్కడికమ్మా?’ చిన్నారులు ప్రశ్న
“అదిగో! ఆ అద్దాల మేడ లోకి……..”
“ఎందుకు?” మరో ప్రశ్న…..
‘మీకు బట్టలూ పుస్తకాలు తెస్తానుగా…”
“మేమూ వస్తాం”….
కౌగలించుకుని బావురుమంది ..
తల్లి హృదయం కదపలేని పెదవులు
స్తంభించిన నాలుక
పెకలని గొంతు
నీచాతినీచమైన దురంత లోకాలకు
శుష్కంగా… అన్న వస్ట్రాలకై……..
వర్షిస్తున్న కన్నీళ్ళలో ప్రతినాద ప్రకంపనాలు
ఉగ్గపడుతుంది…. తుడుచుకుంటుంది అంతలోనే…
తేరుకుంటుంది ..

చిలిపిగా నవ్వుతూ కళ్ళలోకి చూడమంటుంది గోముగా
ఆ ‘మహాతల్లి’ తడి నేత్రాలలో
ప్రేమానురాగాల శక్తి!
కలలు, ఆశలు, ఆశయాలు, సందేషాత్మక సుభాషితములు
అద్భుత సువిశాల బ్రతుకు దారులు !

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.