పల్లవి : అపురూపమైనదమ్మ సమతా నిలయం ! (2)
దైవంగా కనిపించే ఈ నిలయం!
చరణం: అందరి ప్రేమను పంచి ముందుకు నడిపించి !
అన్నింటా ముందుంచి ప్రోత్సాహం అందించి
నేనున్నా అంటుంది మా ఈ నిలయం
చరణం : కులం మతం లేదంటు అందరం ఒక్కటేనంటు
సమానభావం నింపింది సమతా నిలయం
మమ్ము పౌరులుగా తీర్చిదిద్దే మా ఈ నిలయం
చరణం : కష్టంలో తోడయింది స్నేహంగా నిలిచింది
గురువే తనయింది తండ్రిగా నడిపించింది
తోబుట్టులనిచ్చింది మమ్ము ఒక్కటి సేసింది
మా ఈ నిలయం సమతా నిలయం!
చరణం : దైవంగా కనిపించే సమతా నిలయం
మరుపురాని జ్ఞాపకమే సమతా నిలయం!
మా ఈ నిలయం!
సమతా నిలయం సమతా నిలయం!