మనం సత్యమేదో తెల్సుకోవాలి
అది బ్రతుకులో ఉందో
జీవితంలో మిగిలుందో తెల్చుకోవాలి
ఒక స్వప్న పారవశ్యంలో కొట్టుమిట్టాడాక
దాని రహస్యమేంటో పసిగట్టాలి
సత్యం దేనిలో నిక్షిప్తమైందో తప్పక వెదతకాలి
ఎవరో ఏదో వ్రాస్తూ పోతారు
కాని అదికాదుగదా కావల్సింది
మనస్సాక్షిని బయటకుతీసి మధించి
ప్రాణశిల్పానికి తేజాన్నివ్వాలి
కొంతమంది ఏదో ప్రకటించి
నిశ్శబ్దంగా నిష్క్రమిస్తున్నారు
కొందరయితే మట్టిలో రాలిపోతున్నారు
మరికొందరయితే మరణిస్తున్నారు
ఉదయాస్తమయాల్ని ఆలింగనం చేసుకోలేక
రాత్రుళ్ళు మనసు ముడుచుకుని
నిద్రించడమే సుఖమనుకుంటున్నారు
ఇంతమంది ఈ భూమ్మీదకు వచ్చి
తమకితోచింది ప్రకటించి వెళ్ళాక కూడా
మరింతమంది ప్రవక్తల అవసరముందా
అందుకే…
ఎవరి హృదయంలోకి వాళ్ళే తలదూర్చండి
సంచరించండి… ఆడండి… తిరగండి
దాని కొమ్మల్లో రెమ్మల్లో ఊగి
జీవితాన్ని అనుభవించండి
ఒక చైతన్య స్థావరం నిర్మించుకుని జీవించండి.
మనల్ని హింసించినవాడి ఊసేవద్దు
మనచుట్టూ హద్దుల్ని గీసిన వాళ్ళూ వద్దు
నిన్ను ముట్టుకుని ప్రేమించి
నీ కన్నీళ్ళు తుడిచినవాడే నీవాడు
మరణించిన నెత్తురు గురించి మనకేంపని
బ్రతికున్న క్షణాల్ని కాపాడుకుందాం
అందరం ప్రేమగా పలకరించుకుందాం
ప్రేమ భాషలోనే సంభాషించుకుందాం.
-
Recent Posts
- “హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
