మణిపూర్ ముఖచిత్రం మహాగొప్పగా ఉంది. పూర్తిగా ఆ వెన్నెల్లో ఉన్నట్లు ఇరోమ షర్మిలని నిజంగా చూసిన అనుభూతి కలిగింది. చాలా విషయాలు తెలిపారు. ధన్యవాదాలు.
……………. – శారద శివపురపు, హైదరాబాద్.
ఎడిటర్ గార్కి
”చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహస యాత్ర” పర్యటను దృశ్యమానం చేశారు. అభినందనలు.
……………. – సాదనాల వేంకట స్వామి నాయుడు, ఇమెయిల్.
సత్యవతిగారు
మణిపూర్ గుండెను కోసింది. కన్నీళ్ళు కాదు రక్తజలపాతాలు నాకన్నీళ్ళు. అక్షరాలు కూడా గోడున ఏడుస్తున్నాయి. ఈ భూమిక ఈ భూమి పుత్రికల కన్నీటి సముద్రం. – ఝాన్సీ కె.వి. కుమారి, హైదరాబాద్.
…………….
సెప్టెంబర్ భూమిక ద్వారా నేను కూడా మణిపూర్ వెళ్ళి వచ్చిన ఫీలింగ్. మీ వ్యాసం అంతా బాగుంది. థ్యాంక్స్. – సత్యం వేమూరి, హైదరాబాద్.
…………….
సారావ్యతిరేక ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం – ఉద్యమించి సాధించిన ఫలితాన్ని దేన్నీ ప్రభుత్వాలకు అర్పించకూడదు. అలా చేస్తే మోసపోవడం తప్ప మరో పర్యవసానం ఉండదు. మద్యపాన నిషేధం ద్వారా సారా వ్యతిరేక ఉద్యమాన్ని తుడిచేసిన ప్రభుత్వం ఇప్పుడు లైసెన్సులు ఇచ్చి మరీ సారా వ్యాపారం చేయిస్తోంది.
– ఆరి సీతారామయ్య, ఇమెయిల్.