గీ లోట్ల కరువుల మన్నువడగీ లోట్ల కరువుల మన్నువడ – జూపాక సుభద్ర

దొంగ బాడ్కావ్‌! నన్ను గొట్టినట్టు గాదు పంజెయ్యి. పంజెయ్యడు పాట జెయ్యడు పొద్దుకు మూడు సార్ల తిండి యాడికెంచత్తదిరా గాడిది కొడుక పోరగాండ్లు పాసంబంటరని శాతగాకున్నా పనికి బోయి తెచ్చి పెడితే గీ బాడు గుల్ల కొడుకు తింటండు తిరుగుతండు. ఏంది పనికి బోత లెవ్వంటె పనులు దొర్కుతలెవ్వు, నేనెంజెయ్యాలంటండు. గట్టిగడుగుతె గిట్ట నన్ను నెత్తుర్లు గారేటట్టు కొడ్తండు యీనింట్ల పీనిగెల్ల దుడ్డెబల్సినట్లు బల్సిండు యీన్నెత్క కట్కపోను.

అడ్డమీనికి బోతండు పనిలేదన త్తండు. యింటికాడన్న పంజేత్తడా సెయ్యడు, ఆడిదాన్నా అంటడు. లేత్తడు మొకం గడుగుతడు రోడుమీనికి బొయి ‘షాయ’ దాగొత్తడు. అండంగనే తింటండు వట్టిగనే వుంటండు. ఓ ఇల్లు సదురడు, బట్టలు బిండడు, పోరగాండ్లకు పెయికి బొయ్యడు గింత పనందుకోడు అన్ని నేనే సెయ్యా ల్నాయె. యీ సేత పాడుగాను యిటున్న పుల్లటు బెట్టడు వీని తాడుదెంప.

పూల్లెగిట్లెనే తిరుగుతండనీ, వూల్లె పనులు దొర్కుతలెవ్వని గీసిటీ కొత్తిమి. గీడగూడ పంజేత్తలేడాయె, నా వుసురు బోస్కుంటండు వీన్నెత్క కట్కపోను. వుప్పరి పనిల సమిటి, వుసికె నెత్తిన బెట్టుకొని మీదికెక్కాలె, బరువులేసుకొని మీదికెక్క శాతనైతలేదు, ఎన్నుబొక్కలన్ని నొప్పి లేత్తన్నయి. దావుకానకు సూయించుకుం దామన్నా పైస దొర్కుతలేదాయె. మేస్త్రీ పైసలు దొర్కుతలేవని కూల్లు గట్టిత్తలేడు, వారవారం సెక్కులు దీస్కొండ్రి యిదువర కిచ్చినట్లు నోట్లు యియ్యలేమంటుండు. బ్యాంకు లెయ్యాలట సెక్కులు. మాకు బ్యాంకెట్లుంటదో తెలువకపాయె, బ్యాంకు బుక్కుంటెనే సెక్కులు సెల్లుతయాట.

ఈ అయిదొందలు, వెయి నోట్లు సెల్తలేవాయె, మేస్త్రియిచ్చే రొండువేల నోట్లు యాడిచ్చినా సిల్లర లేవంటండ్రు. రొండువేల నోటుగూడ సెల్లెని లెక్కే దుకాండ్ల సిల్లర సామానుకు కొంటబొయినా యీనోటు జూసి సిల్లరిస్తలేడు. ఎట్లజేద్దు, ఏంజేతు! గీకత గిట్లున్నది బ్యాంకుబొయి బుక్కన్న దెమ్మంటె పైసలు గావాలె గదంటడు. యాడ సుతులాయిస్తలేదు. బ్యాంకుల పైసలున్నోల్లే శాంతాడంతలైనులు గట్టి పొద్దన్నుంచి రాత్రిదాకా కూడునీల్లు లేక నిల్సున్నా పైసలొస్తయని గ్యారంటి లేదాట. యిగ బ్యాంకు బుక్కులు, సెక్కులు లేని మా అసోంటోల్ల కత గోసకత. ఎవలగ్గావాలె. లైండ్లల్లుండి శానమంది సచ్చిపోతండ్రట. యిది వరకు మేస్త్రి వారవారం కూలిచ్చేది. గిప్పుడేమె సెక్కులిత్త తీసుకోండ్రి లేకుంటె పైసలిడిపిచ్చి యిచ్చే దాకాగుండ్రి’ అంటండు. గిన్ని బాదలన్ని నేనే పడాలె, ఎవ్వి బట్టయి యీ బాడ్కావుకు అన్ని నేనే సావాలె. యింట్ల పోరగాండ్లకు బాగలేకున్నా నాకేబాద, యింట్లేమిలేకున్నా నాకేబాద, యియన్ని జేసినా దెబ్బలు దెంగులు ఈ గుడ్డెగాడిది తోని. గీ లోట్ల కరువుల మన్నుబడ! దుబ్బవడ!

పొద్దుగాలలేసి బిల్డింగంత వూడిసె పటికె ఓనరోల్లు పైనగింతరేకుల రూము గట్టిచ్చి మనల్నుంచబట్టిరి. లేసి గీ బిల్డింగు మెట్లన్న వూడుస్తడా… పెయంగది! రోజు మెట్లు మూడంతస్తులయి వూడ్చి కడుగకుంటె యెల్లగొడ్తరు, యాడికి బొయి వుంటము. గీ పనన్న జెయ్యడు. పొద్దుగాల గీ మెట్ల పంజేసి బాసాండ్లు తోముకొని, పోరగాండ్లకు తానాలు జేపిచ్చి బువ్వొండి కూరో తొక్కో జేసి టిపిండ్లుగట్టి వాల్లను బడికిసాగదోలి తిని తినక అడ్డకాడికి వురుకుత. అడ్డమీద టైముకుండాలె లేకుంటె పని దొర్కుతదా!

గింత పంజేత్తాంటె గీ దొంగ బడ్కావ్‌, లఫంగి లంగ బాడ్కావు పొద్దుగాల షాయ పొద్దుమీకి గుడంబ దాగుతడు యంట్ల పైసియ్యడు. యీడికి రొన్నెల్లాయెపనికి బోక. ఏందంటే… ”నేనేంజెయ్యను పనికి ఏ సేటు బిలుస్తలేడు. పందొర్కంది నేనేంజేతు? నోట్లు లెవ్వాట, పంజేయించుకొని పైసలియ్యాలె గద! గాపైసలు బ్యాంకుల గూడలెవ్వాట. నోట్ల కరువొచ్చె వాల్లేంజేత్తరు. యాడికాడికి పనులన్ని అడ్డంబడ్డయి. నీకేమెర్కనే కుక్క వదిరినట్టు వదుర్తన్నవు. కాని పోని మాటలంటవు లంజెముండా. నోరు దగ్గెర బెట్టుకో… నువ్వొక్క దానివే సేత్తన్నట్టు పదిండ్లపెట్టు గీ లొల్లేంది, కతేందే… మొగన్ని లంజకొడ్కా బాడ్కావంటరానే, ఆరే తొరే అని తిడ్తరానే… నువ్వు గట్ల తిడ్తవనే… నేంగొడ్త… నా తప్పేందే గీ నోట్ల కరువుతోని పనులన్ని బండుకున్నయి నన్నెవడడిగిండే… యాడ పనులు దొర్కుతలేవాయె నేనేంజెయ్యనే. నోట్లు బందువెట్టిందాట సర్కారు, నోట్లు లేకుంట యెట్ల బత్కాల్నో సమజైతలేదాయె”.

ఈ లొల్లి, బైసు, బొబ్బలు, ఏడుపు లు, కొట్లాట మాయింటెనుక బిల్డింగు మీద చిన్న రేకుల షెడ్డులో ఉండే ఒక వలస కుటుంబంలో జరిగింది. సడల్న నోట్ల రద్దు, నగదు రద్దని పెట్టి జనాన్ని అందులో కూలి, నాలి జేసుకునే అవ్యవస్తీకృత రంగాల్లోని దళిత, ఆదివాసీ, బీసీ కులాలకు, మైనారిటీ ఆడవాళ్ళకు ఎంత హింస, నరకమనుభ విస్తుండ్రో…

 

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.