ఆకాశంలో హరివిల్లును నేను ఆడుకోలేవు నీవు నా రంగులతో
నువ్వు సృష్టించలేదు ఒక్క రంగు కూడా
వెండివెన్నెల జాబిలమ్మను నేను అందుకోలేవు నీచేతులతో
నీది కాదు ప్రతిబింబం కూడా
విశాల సాగర ఆవలి తీరం నేను చేరుకొలేవు నీ పాదాలతో
మాటవినదు ఒక్క నీటి బొట్టు కూడా
కణకణ మండే నిప్పును నేను హత్తుకోలేవు నీ గుండెలకీ
నన్ను పొగడకుండా ఉండలేవు కూడా
చిరుగాలికి తలఊపే పుష్పం నేను దోచుకోలేవు నా పరిమళాన్ని
ఒడిసిపట్టి దాచుకొనేది కాదు కూడా