భూమిక పత్రికా సంపాదకులకు,
నమస్కారములు. నేను భూమిక మాసపత్రిక చదివాను. ఈ పత్రికలో వచ్చిన సంపాదకీయాలు, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక పరిచయాలు నన్ను చాలా ఆకర్షించాయి. చాలా ఆనందంగా అనిపించింది. భూమిక మాసపత్రిక నూతన కవులకి వేదికలాగా అనిపించింది.
– ఎ. శ్రీలత, పెనుగొండ
భూమిక ఎడిటర్‌కి,
‘భూమిక’ స్త్రీ లోకానికి భూమిక నిజంగా సమాజం మారాలనుకునేవాళ్ళు తప్పనిసరి చదవాలి.
ఎడిటర్ గారికి,
భూమిక పుట తయారీ గురించి ఒక మాట. ఫోటొ పుట మధ్య వేస్తే ఇటు అటు పంక్తులు కలుపుకుని చదవటం ఇబ్బందిగా ఉంది. పుటకు ఒక పక్కగా వేస్తే ఆ ఇబ్బంది ఉండదు.
– వి.ఎ.కె.రంగారావు, మద్రాస్