గత మూడు సంవత్సరాలుగా భూమిక చంచల్గూడ మహిళా కారాగారంలో మహిళా ఖైదీల సంక్షేమం కోసం పని చేస్తోంది. కౌన్సిలింగ్, న్యాయ సహాయం వారి పిల్లల చదువు సంధ్యలు, రిలీజ్ తర్వాత వారు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళేలా వారి కుటుంబాలతో పని చేయటం లాంటి కార్యక్రమాలు చేస్తున్నది భూమిక. అలాగే వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని జైలుకు పిలిచి వారితో సెషన్లు చేయటం జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఖైదీలలో మానసికోల్లాసం, జీవితేచ్ఛ, తిరిగి జైలుకు రాకుండా ఉండేలా వారిలో ఆలోచనలు పెంపొందించడం, క్రమశిక్షణతో ఉండడం లాంటి ఫలితాలను పొందడం ముఖ్య ఉద్దేశ్యంగా ఉంటుంది. సందర్భంలోనే మహిళల పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా ప్రపంచ మహిళలంతా జరుపుకునే మహిళాదినోత్సవం మార్చి 29వ తేదీనాడు మహిళాకారాగారం, చంచల్గూడలో నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి అమరావతి, జైలర్ పాల్గొన్నారు. భూమిక సంచాలకులు ప్రశాంతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మహిళా దినోత్సవ విశిష్టతను తెలియచేసారు. దానితో పాటుగా భూమిక నిర్వహించిన వివిధ పోటీలను వాటిలో పాల్గొనటానికి మహిళా ఖైదీలు కనబరచిన ఉత్సాహాన్ని మెచ్చుకున్నారు. మహిళా ఖైదీలతో పాటు వారితో కలిసి ఉంటున్న వారి పిల్లలకు కూడా పోటీలు నిర్వహించారు. మహిళా ఖైదీలు ఈ పోటీలలో పాల్గొన్న విధానం చాలా స్ఫూర్తిదాయకంగా, ఉత్సాహవంతంగా, ఉందని, వయస్సును కూడా లెక్కచెయ్యకుండా పోటీలలో గెలిచారన్నారు. జైలర్ అమరావతి మాట్లాడుతూ భూమిక మహిళా ఖైదీలలో మానసిక ధైర్యాన్ని నింపడంతోపాటు, వారి కుటుంబాలను కలపటానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుతూ భూమిక చేస్తున్న కార్యక్రమాల రిపోర్టును తనకు అందించాలని ఆ రిపోర్ట్ తను తన పైఅధికారులతో పంచుకుంటానని అన్నారు. ఆ తర్వాత ఆటల పోటీలలో, డ్రాయింగ్, కథారచన పోటీలలో గెలిచిన మహిళలకు భూమిక చీఫ్ ఫంక్షనరీ సత్యవతి, జైలర్ బహుమతులను ప్రదానం చేసారు. తరువాత ఒక మహిళా ఖైదీ మాట్లాడుతూ రకరకాల పరిస్థితులలో కారాగారానికి వచ్చిన మహిళలకు అండగా ఉండి ధైర్యాన్ని అందిస్తున్న జైలర్గారికి, భూమిక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా ఖైదీలు, భూమిక సిబ్బంది కలిసి పాటలు పాడారు. ఆనందోత్సహాలతో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమం జాతీయగీతం పాడడంతో ముగిసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags