బాపురే కలం నుండి
బ్రహ్మ కవిత పుట్టాలి
తిస్రగతి చతుస్రగతి
సహస్ర గతుల సాగాలి!
మాత్రా ఛందస్సులకు
మధురిమలను కలిగించే
భావజాలమే కవితా
జీవనరులి కావాలి!
సప్తస్వరములకు, కళా
దీప్తుల హారతులిచ్చే
సుందర రసబంధంర
పదబంధములుదయించాలి!
నాల్గువేర్ల అభినయ
నాట్యములను ఆడించే
హస్తముద్రలెరిగినట్టి
అక్షరాలు వెలగాలి!
శ్రువిలయ శోభాయుతమై
సంగీతము పులకించే
సత్యాదిత్యాభ నుండి
సాహిత్యం రావాలి!