సుదీర్ఘ యుద్ధం – నాంపల్లి సుజాత

రాశి ఫలాల కోసం

వెంపర్లాడితిమి కదా!

రాజ్యపూజ్యాలను వెతుకుతూ

ఆ పంచాంగంలో…

విజృంభిస్తున్న వైరస్‌ గురించి

విప్పి చెప్పిందా ఆ గ్రంథం?

విశ్వమానవ మరణాలను

లెక్కచూపిందా… గ్రహశాస్త్రం?

ఏమిటేమిటి!?

ప్రపంచ పౌరులు తన పరిధిలోకి రారా!!?

భూగ్రహం నీ ఒక్కడి సొత్తేనా

ఇదేం వివక్ష… ఇంతకన్నా

ఆ వైరస్సే నయ్యమ్‌

రాహుకాలం.. వర్జ్యం

ఆ రాజ్యం… ఈ రాజ్యం

ఉన్నోడు లేనోడు… యేదీలేదు

అరదరిపట్లా సమదృష్టే

అన్నట్లు దేన్నైనా హరించే శక్తి

గ్రహశాంతికి సాధ్యమేనట కదా!

ఇప్పుడు చేయించండి

కనబడని వైరస్‌కి శాంతి

పంచారగ శ్రవణాలూ

నక్షత్ర గమనాలంటూ

చెవులు రిక్కించితిరి కదా

సూర్యుడు చంద్రుడూ

గ్రహణాలేనని వల్లించే

అశాస్త్రీయ కట్టుకథలని

ఇకనైనా ఆపుదామా?

ఈ కనబడని వైరస్‌కి

విరుగుడు కనిపెట్టగలదా గ్రహశాస్త్రం

గోమూత్రం గోపేడా

మానుకోండి అదో మూఢ జపం!

ఉన్న కాసిన్ని క్షణాలని కరిగి పోనీకండి

మన మురదిప్పుడు

కేవలం స్వీయనియంత్రణే

సామాజిక దూరమే

అణ్వాయుధం

అదృశ్యంగా ఉన్న ఆ శత్రువును

కరవాలంతో కాదు కడిగెయ్యాలి సబ్బుతో

ఇక విజయం మనదే సుమా!

సుదీర్ఘమైనా ఓర్పుతోనే గెలవాలి!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.