ఈ సంవత్సరం నేను మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమా లను మిస్సయ్యాను. ఇంకా చిన్న పిల్లలు పాల్గొనే బాలానందంలో మేము చాలా ఎంజాయ్ చేస్తాము, అనేక ప్రదర్శనలలో పాల్గొంటాము. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు సైన్స్ ఫెయిర్, ఇంకా మన మంగళగిరి గ్రంథాలయంలో రచనలు రాశాము. ఎన్నో పుస్తకాలు చదివాను. ఇలా చాలా రకాల వాటిలో పాల్గొన్నాము. ఈ సంవత్సరం ఇవన్నీ లేవు. స్పోర్ట్స్ డే రోజున చాలా ఆనందంగా, సంతోషంగా గెలవాలనే పట్టుదలతో ఎన్నో రకాల ఆటలు ఆడతాము.
మా పాఠశాల తరపున ఎన్నో ట్రిప్స్‌కి వెళ్ళాము. అప్పుడు బస్సులో మాటలు, నవ్వులు, ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం.
ఇవన్నీ చాలా బాగా గుర్తుకొస్తున్నాయి…
ఇంకా ఎంతోమంది స్నేహితులను మిస్సవుతున్నాను.