భాగ్యనగరం సొగసులు
నాటి కాకతీయులు,
నిజాం నవాబులు…
మనకు ప్రసాదించిన వారసత్వ సంపద
నేటి క్షణ క్షణ క్షీణఅవరోహణ ఉత్పాతపయనం
ఈ పాపపంకిలంలో ఎవరి పాత్ర ఎంతో
ఆ పరమేశ్వరుడి సాక్షిగా
బతుకమ్మ వీక్షిస్తున్నది
ఆ మధుర స్వప్నాల
భాగ్యనగరం గుర్తులు
హుష్ కాకీ చేస్తున్నారు
ఇప్పటి స్వార్థపరులు
అల్లాప్రభు సాక్షిగా బతుకమ్మ వీక్షిస్తున్నది
శారదాదేవి కటాక్షము కరువైన
మహా సమ్రాట్ అక్బర్
ఐదు దశాబ్దాలు ఏలిన అక్బర్ చక్రవర్తి
ఫతేపూర్ సిక్రీ నిర్మించి తన తప్పు
తెలుసుకున్న వైనం
ఆగమేఘాలపైన రాజధాని
ఆగ్రాకు బదిలీ చేయగల్గిన
అత్యంత అమోఘ శాస్త్రీయ పరిశోధనా కౌశలం
దీన్`ఇ`ఇల్లాహి సాక్షిగా బతుకమ్మ వీక్షిస్తున్నది
అలనాటి చెరువులు, నాలాలు
మన పాలకులు ఆక్రమణ,
క్రయవిక్రయాలు చేసీ చేసీ
హిందూ, ముస్లిం సంస్కృతికి చిహ్నమై
శోభాయమానంగా విలసిల్లుతోన్న భాగ్యనగరం
నేడు కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది
యజ్ఞయాగాలతో వాల్మీకి
రామాయణంలో శ్రీ రాముని
వేదవ్యాసుడు భారతంలో
ద్రౌపదిని ఆవిర్భవింప చేసినట్లు
మరొక మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పుట్టించగలమా?!?
తరతరాలుగా తిరగలిలా
తిరుగుతోన్న మన రక్తం
నాసిరకంగా మారి చాలా కాలం అయిపోయింది
సర్వత్రా ప్రతిభ, ప్రగతి…జుఅస ూశీఱఅ్ కి చేరుకున్నాయి
ఒక ఢల్లీి, ఒక ముంబై, ఒక హైదరాబాద్
విశ్వనగరాలు… అలో లక్ష్మణా!?
అని అలమటిస్తున్నాయి
ఎవరు ఏ కలంతో చలించి, జ్వలించి మొరపెట్టుకున్నా
మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఇవే కవితలు
మార్చి మార్చి రాసుకోవాలి… ఏమో
అలానే అనిపిస్తోంది
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే
కళ్ళు తెరవకపోతే
ప్రపంచపటంపై… బ్లా బ్లా బ్లా బ్లా
భారత్… తథ్యం… తస్మాత్ జాగ్రత్త…