యువతుల్లారా! – ఎస్‌.కాశింబి

మితి లేని సంపాదన కాదు
మదిలోని సంతృప్తే సంతోషమని
కదలక కూర్చునే సోమరితనం కాదు

స్వేదం చిందించడంలోనే సుఖముందని

లెక్కలేనన్ని సౌకర్యాలు కాదు
అక్కరకొచ్చే సర్దుబాట్లే ప్రగతి మెట్లని
నచ్చినట్లుంటే ఇష్టాలు కాదు
వచ్చిపడే కష్టాలే దారిదీపాలని

కంటి మెరుపులు కాదు
కన్నీటి పొరలే కర్తవ్యబోధకులని
పెద్దలిచ్చిన సంపదలు కాదు
ఎదురయ్యే సమస్యలే వ్యక్తిత్వ నిర్ణేతలని

అహం చాటే నడక కాదు
అణకువ నిండిన నడతే మేటి అలంకారమని
అతిశయ ప్రదర్శన కాదు
ఆత్మీయతే గొప్పదనపు సూచికయని

విచక్షణతో గ్రహించండి
విలువలతో జీవించండి
మనదైన వారసత్వ సంస్కృతిని నిలపండి
ఘనమైన భవిష్యత్తుని ముందు తరాల కందించండి!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.