కాలం ఎంత విచిత్రమైనది అంటే
కొన్ని గాయాలను మరిపిస్తుంది…
కొత్త గాయాలను సృష్టిస్తుంది…
కాలం ఎంత విచిత్రమైనది అంటే
నీ బాధలకు ఓదార్పునిస్తూ ముందు రోజులు ఇంకా నీ కోసం
వేచి ఉన్నాయని గుర్తుచేస్తుంది…
కాలం ఎంత విచిత్రమైనది అంటే
నీలో భావాలు చెప్పే లోపు
నీకు విలువ లేకుండా చేస్తుంది…
కాలం ఎంత విచిత్రమైనది అంటే
ఆలోచించేలోపు నిర్ణయాలు తీసుకుని
నిను నిత్యం బాధపడేట్లు చేస్తుంది…
కాలం ఎంత విచిత్రమైనది అంటే
కొత్త స్నేహాలను ఇస్తుంది, పాత స్నేహాన్ని మరచిపోయినట్లు
నటింపజేస్తుంది…