అసాధారణ స్త్రీ – స్వేచ్చానువాదం : జాని తక్కడశిల

English: Maya Angelou
నా రహస్యం ఎక్కడ ఉందోనని
అందమైన మహిళలు ఆశ్చర్యపోతారు
నేను క్యూట్‌గా లేను లేదా

మోడలింగ్‌ చేసే అమ్మాయి శరీర ఆకృతిలో లేను
నేను చెప్పడం ప్రారంభించగానే
అబద్దం చెప్తున్నానని అనుకుంటారు.
నేను చెప్తున్నాను,
ఇది నా చేతులకు చేరువలో ఉంది,
నా తుంటి పొడవు
నా పొడవాటి అడుగు
నా పెదవుల వంకర
నేనొక అసాధారణ స్త్రీని.
అద్భుత మహిళ,
అది నేను.

నేను ఒక గదిలోకి నడుస్తాను
మీకు నచ్చినంత చల్లగా, మీలాగా
మరియు అతనికి,
ఎవరైతే నిలబడ్డారో లేదా
మోకాళ్ల మీద పడ్డారో.
వాళ్లు నా చుట్టూ తిరుగుతారు,
తేనేతొట్టెలోని తేనెతీగలు.
నేను చెప్తున్నాను,
ఇది నా దృష్టిలో అగ్ని,
మరియు నా దంతాల వెలుగు,
నా నడుములోని ఊపు,
మరియు నా పాదాలలో ఆనందం.
నేనొక అసాధారణ స్త్రీని.
అద్భుత మహిళ,
అది నేను.
పురుషులు, నాలోకి చూసి ఆశ్చర్యపోయారు.
చాలా ప్రయత్నించారు
కానీ వాళ్లు
నా అంతర్గత రహస్యాన్ని చేధించలేకపోయారు.
నేను వాళ్లకు చూపించడానికి ప్రయత్నించినప్పుడు,
చూడలేకపోతున్నారని చెప్పారు.
నేను చెప్తున్నాను,
ఇది నా వెనుక వంపులో ఉంది,
నా చిరునవ్వు సూర్యుడు,
నా రొమ్ముల సవారీ,
నా రూపలావణ్యం.
ఎందుకంటే
నేనొక అసాధారణ స్త్రీని.
అద్భుత మహిళ,
అది నేను.

ఇపుడు నీకు అర్థమయ్యిందా
నా తల ఎందుకు వంచలేదో.
నేను అరవడం లేదా దూకడం లేదు
నిజంగా
బిగ్గరగా మాట్లాడుతున్నాను.
నేను దాటుకుంటూ వెళుతున్నప్పుడు,
అది మిమ్మల్ని గర్వపడేలా చేయాలి.
నేను చెప్తున్నాను,
ఇది నా మడమల క్లిక్‌లో ఉంది,
నా జుట్టు వంపులో,
నా అరచేతిలో,
నా సంరక్షణ అవసరం.
ఎందుకంటే
నేనొక అసాధారణ స్త్రీని.
అద్భుత మహిళ,
అది నేను.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.