వెండి వెలుగు – డాక్టర్‌ టి.శ్రీ రంగస్వామి

‘‘అన్నా!… ఎక్కడనే…’’ అంటూ ఫోన్లో రజిత పలకరింపు.
‘రజితా!… ఇంట్లోనే… ఇంట్లో కాక ఎటు వెళ్తాను? ఇంతకీ ఏమిటి విషయం…’’
ఏం లేదు… ఎల్లుండి మా ఇంటికి రారాదు! మన మిత్రులు నలుగురం కలుద్దాం…’’

‘‘సరే!… నేను మళ్ళీ నీకు చెప్తాను!
నీ ఇష్టం అన్నా… నా పిలుపును కాదనవనే నమ్మకం ఉంది అంటూ ఫోన్‌ పెట్టేసింది.
రంగయ్య ఆలోచనలో పడ్డాడు. తను గత సంవత్సరం తన సగం వెళ్లిపోయాక ఎవరి ఇంటికి భోజనానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. అలా ఎందుకంటే … ఇన్ని సంవత్సరాలు పరిచయం ఉన్నా, బంధుత్వం ఉన్నా భోజనానికి పిలువని వారు ఆమె లేని లోటును గుర్తు చేస్తూ భోజనానికి రమ్మంటే తనకు నచ్చలేదు. అది కాకుండా మా ఆవిడ జరిగిపోయింది, భోజనానికి వచ్చాను అన్నట్టుగా ఉందని.. ఎవరు పిలిచినా వెళ్లవద్దని గట్టి నిర్ణయం తీసుకొని ఆహ్వానించిన వారందరికీ సున్నితంగా తిరస్కరించాడు. ఒక ఏడాదో, ఆర్నెల్లో గడిస్తే విషయం మరుగున పడిపోతుంది కూడా. అందుకు తగ్గట్టుగా రంగయ్య కుమారుడు తను పనిచేస్తున్న ప్రదేశమునకు తీసుకువెళ్లాడు. ఇక్కడ ఒక్కడే ఉంటే అమ్మ ధ్యాసలోనో, బంధువుల మిత్రుల పలకరింపులకు ఇబ్బంది పడతాడేమోనని.
గత నెలలోనే భార్య సంవత్సరీకం అయిపోయింది. రజిత అంటే ఒక విధంగా ప్రత్యేకమైన అభిమానం. తను అడిగినది ఏది కాదనలేని పరిస్థితి. తను కూడా నేనేదైనా కాదు అనకుండా నా వెంట ఉంటుంది. రజితతో ఉన్న 50 ఏళ్ల స్నేహితంలో ఎన్నడూ పొరపొచ్చాలు రాలేదు. రంగయ్య సతీమణికి కూడా రజిత అంటే ప్రత్యేక ఆప్యాయత. వదిన నేను వస్తున్నాను మాకు టిఫిన్‌ చేసి పెట్టు అంటే రజిత వచ్చేసరికి సిద్ధంగా ఉంచేది. రజిత చేస్తున్న సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, పోరాటాలు రంగయ్య భార్యకు ఇష్టం. అలాగే రజితకు ఈ వదినా అంటే చెప్పలేని ఆప్యాయత. ఎంతో ప్రత్యేకం కూడా. ఆమె రజితకు మాత్రమే వదిన కాదు, రజిత ప్రపంచానికి కూడా వదిననే, అలా రంగయ్య కూడా అన్ననే.
ఇక రజిత విషయానికి వస్తే… స్త్రీవాద ఉద్యమాలు దళిత జీవుల వెంట నిలబడి వారి సమస్యలను తెలుసుకుని స్వయంగా వెళ్లి పరిష్కరించే విధానము ఎందరికో నచ్చేది. కేవలం స్త్రీవాదం అంటూ పత్రికలలో వేదికలపై నిలబడి చెప్పడం కాదని సంఘటన దగ్గరకు వెళ్లి పరిశీలన చేసి న్యాయం వైపు నిలబడే నిర్భయతత్వం తనది.
ముజఫర్‌్‌ మారూ హోమం జరిగినప్పుడు తను ఇక్కడ నుండి తనతో పాటు నలుగురైదుగురు సహచరులను వెంట తీసుకొని వెళ్లి బాధితులను ఓదార్చి వారికి ఆహార పదార్థాలు బట్టలను అందించిన ధీర. ఆ సంఘటనన్నిటిని తను తన సహచరులతో అక్షరీకరించి ‘‘ముజఫర్‌నగర్‌ మారనకాండ’’ ఒక పుస్తకం తెచ్చింది.
రజిత ఆర్ద్రత గురించి కృష్ణవేణి ఒక ఇల్లాలు (చిన్నతనంలోనే పెళ్లి అయింది) ఒక కవి సమ్మేళనంలో వచ్చి ఒక కవిత చదివితే తనను దగ్గరకు తీసుకొని వివరాలను రాబట్టగా… తను వ్యవసాయ పనులు చేసుకుంటూ ఎస్‌ ఓ ఎల్స్‌ ఎస్‌ (సోల్స్‌) (సార్వత్రిక విద్యలో) డిగ్రీ చేస్తున్నానని చెప్పింది. వెంటనే నీకు ఏమి కావాలన్నా నా సహాయం తీసుకొనమని చెప్పింది. ఆ అమ్మాయి డిగ్రీ తదుపరి బిఈడి లో చేరింది. కానీ ఫీజు కట్టడంలో ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. మహిళా కవి సమ్మేళనంలో ఆ సభ ఏర్పాటు చేసింది రంగయ్యగారే. రజిత ఆ కృష్ణవేణి ఎంత డబ్బు కట్టాలంటే 2000 అని చెప్పింది. ఆ మాట విని రంగయ్య తన జేబులో నుండి 3000 రూపాయలు తీసి రజితకిచ్చి ఆమెకి ఇవ్వమని చెప్పాడు. రజిత వెంటనే సభాముఖంగా కృష్ణవేణికి ఆ డబ్బు ఇస్తూ ఫీజు కట్టు పుస్తకాలకు మిగతా డబ్బు వాడుకొనమని చెప్పింది.
రజిత పరిచయమే ఒక సాహిత్య సమావేశం ద్వారా తెలంగాణ ఉద్యమ అస్తిత్వ నేపథ్యంలో ‘‘తెలంగాణ కథా రచయిత్రుల కథలు’’ సేకరించగా దానిని నవచేతన వారు పుస్తకముగా ప్రచురించారు.
రజితకు మామూలు గృహిణి అయిన రంగయ్య భార్య తన స్నేహితురాలైన సుగుణమ్మ ఎంతో… ఆచార్య పాకాల యశోదరెడ్డి అన్నా అంతే మక్కువ. యశోదరెడ్డి గారి మోనోగ్రాఫ్‌ను తెలుగు అకాడమీ ద్వారా వెలువరింప చేసినది. ఆ మోనోగ్రాఫ్‌ను మరింత విస్తృత రూపంలో ప్రచురించే ప్రయత్నంలో ఉంది. రజిత అంటే ఒక ఉద్యమ స్వరూపిణి.
రజిత అంటే అందరికీ ఒక ఆప్యాయతతో కూడిన జంకు. ఎందుకంటే ఎవరినైనా నిర్మొహమాటంగా ప్రశ్నించగలిగే శక్తివంతురాలు. రజిత కవిత్వం రాసినా, కథలు రాసినా పీడిత జనుల పక్షపాతం వైపే తాను వెలువరించిన సంకలనాలు యదార్థ సంఘటనలపై ప్రతిఘటనలే. అందువలన రజితతో మాట్లాడే ముందు కాస్త జంకుతారు.
రజిత ఎంత నిక్కచ్చిగా ఉన్నప్పటికిని తనలోని ప్రేమ, ఆప్యాయతను, వాత్సల్యమును కూడా అదే పాళ్ళలో పంచడం తను విశేషము. ఆ ఆప్యాయత రంగయ్య భార్య గతించిన నెలలోన, ఆరుసార్లు ఇంటికి వచ్చి ఓదార్పు అందించడమే కాక రంగయ్య కొడుకు, కోడలు, కూతురు మిగతా ఇంటి సభ్యులతో కలిసిపోయింది. అది తన జీవనంలోని ప్రత్యేకత.
ఇక రజిత విషయానికి వస్తే తను ఒంటరిది కానీ తనని జగమంత కుటుంబం. వివాహం వైపు దృష్టి మరల్చలేదు. యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేసింది. తండ్రి మున్సిపల్‌ కార్పొరేటర్‌గా పని చేశాడు. తల్లి తండ్రి ఇద్దరు లేరు. తన మేనత్త ఉపాధ్యాయురాలిగా పనిచేసే తనను గైడ్‌ చేసేది. ఉన్న ఒక్క చెల్లెలు కూడా ప్రేమ వివాహం చేసుకొని దూరంగా తన తోబుట్టువు కాదన్నట్టుగా ఉంటుంది. ఏది ఏమన్నా తను సంఘజీవి. స్నేహితులే ప్రపంచం అనుకుంది. తను నమ్మిన సిద్ధాంతాల పట్ల ఆదర్శాల పట్ల ఏమాత్రం సడలింపు లేకుండా తన జీవనయానం సాగిస్తున్నది. ఇక్కడే రజిత అంటే రంగయ్యకు ఎంతో ఇష్టం. తను ఏది అడిగినా కాదనడు.
ఇలా ఆలోచిస్తూ… మరి ఇప్పుడు రజిత పిలుపును ఎందుకు కాదనాలి. అన్నా అని పిలిచినా ఆప్యాయతను ప్రేమను కాదనడం బాగుంటుందా అనిపించింది. వెంటనే రజితకు ఫోన్‌ చేసి నేను వస్తున్నానని చెప్పాడు రంగయ్య.
రజిత ఇంటికి వెళుతూ ఏం తీసుకువెళ్లాలి? తనకు షుగరు ఏ ఏ పండ్లను తీసుకోవాలని ఆలోచించి దానిమ్మ పళ్ళు, బత్తాయిలను తీసుకొని తన స్కూటర్‌ పైన వెళ్ళాడు.
‘‘అన్నా వచ్చినవా! బయలుదేరే ముందు ఫోన్‌ చేస్తే మన ఆటో పంపించే దానిని కదా!’’
ఎందుకు! నా స్కూటర్‌ ఉంది కదా! అయినా దానికి అప్పుడప్పుడు పని చెప్పాలి కదా సాయంత్రం వెళ్లేటప్పుడు ఉపయోగ పడుతుందని’’ అన్నాడు.
‘‘అన్నా… ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నీవు పెద్దోడివి అవుతున్నావు సరేలే మొత్తానికి వచ్చావు సంతోషం’’.
ఇంతలో… ‘‘అన్నా బాగున్నావా…’’ అంటూ సుజాత వచ్చింది లోపలి నుండి
‘‘నీవు ఇక్కడే ఉన్నావా!…’’ అని అంటుండగా…
‘‘ఇంకెవరూ రారు మన ముగ్గురమే…’’ అని అంది
రజిత వంటలు చేయించింది. సుజాత వస్తూ తన వంతుగా ఇంటి నుండి నిమ్మకాయ పులిహోర తీసుకొని వచ్చింది. అలా ఆ రోజంతా ముగ్గురం మాటలతో గడిపాము. ఏదో గుర్తుకు వచ్చినట్టుగా అన్నా మనం షాపింగ్‌కి వెళ్లి వద్దామా అంటూ అడిగింది రజిత. ‘‘కడుపు నింపావు ఇంకా షాపింగ్‌ ఏమిటి…’’ అంటూ తన మాటను దాటవేశాను. తన ఆలోచన ఏమిటంటే వదిన పోయాక వచ్చాడు. కొత్త బట్టలు కొనిద్దామని ఆలోచన అని గ్రహించాడు రంగయ్య. తోబుట్టువులకు పట్టింపు లేదు వారికి ఆస్తులు, డబ్బులు, కట్నాలు తప్ప ఈ ఆప్యాయతలు అవసరం లేదు.
‘‘అన్నా మనమందరం మరొకసారి కలుద్దాం. మా ఇంటిలోనే… సుమిత్ర, అంజని, విద్య, సుజాత అందరిని పిలుచుకుందామని అంది. నన్ను పూరడిరచడానికి తను చేస్తున్న ప్రయత్నం చూసి రంగయ్య కళ్ళు చమర్చాయి.
రజిత అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంది. ‘‘అన్నా వచ్చే నెలలో మనమందరం కలుస్తున్నాం. మనవాళ్లుకు చెప్పాను సంతోషపడ్డారు’’ అంటూ ఫోన్‌ చేసింది. రజిత నేను వచ్చే నెల మొదటి వారంలో మా అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను. మావాడు టికెట్స్‌ రిజర్వేషన్‌ చేశాడని అనగానే సరే వచ్చాక కలుద్దాం అని అంది.
రంగయ్య రజితకు చెప్పినట్టుగానే తన కొడుకు దగ్గరకు వెళ్ళాడు. రెండు రోజుల తదుపరి శ్రవణ్‌ నుండి ఫోన్‌…
అన్నయ్యా! ఈ విషయం తెలిసిందా మీరు ఊర్లో లేరా! నార్మల్‌ ఫోను కలుస్తలేదని ఇలా చేశానని అన్నాడు. శ్రవణ్‌ ఏ విషయం తెలీదు. నేను నా కొడుకు దగ్గరకు వచ్చాను అని చెప్పాను. మన రజిత అక్క ఒకేసారి తూలిపడి, గుండెపోటుతో ఈ మధ్యాహ్నం ప్రాణం విడిచింది అని చెప్పాడు.
రెండు మూడు నిమిషాలు స్తబ్దుడనయినాను. రజిత పోవడమేమిటి? తను ఆక్టివ్‌గానే ఉంది కదా! అని ఆలోచనలోపడి వెంటనే తేరుకొని… ఆరోజు వదిన పదమూడవ దిన కార్యక్రమంలో అవయవదానంగా… తన నేత్రాలను శరీరంను దానంగా రాసిచ్చింది కదా! ఆ ఏర్పాట్లు చూడు శ్రవణ్‌ అని ఫోను పెట్టేసాను.
రజిత పోవడం అంటే తట్టుకోవడం మనసుకు ఇబ్బందిగానే ఉంది. సంవత్సరంలోపే తన భార్య, ఆప్తమిత్రుడు సమ్మయ్య ఇప్పుడు రజితలు కనుమరుగవ్వడం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంది. రంగయ్య పరిస్థితిని చూసిన కొడుకు, కోడలు వచ్చి ధైర్యంగా ఉండండి అంటూ సానుభూతిని ఇచ్చారు.
మనసును కుదుటపరుచుకొని రజిత సమాచారంను తన దగ్గర ఉన్న ప్రధాన సమూహాలలో వాట్సప్‌ ఫేస్‌ బుక్‌లలో పెట్టాడు రంగయ్య. ఆ పోస్టులను రజితకు నివాళులను సమర్పించసాగారు. అంతేకాకుండా వారి వారి వాట్స్‌అప్‌ సమూహాలలోను ఫేస్‌ బుక్‌లలో రజిత పట్ల ఉన్న అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నారు.
రజిత కోరిక మేరకు నేత్రాలను నేత్ర వైద్యశాలకు, శరీరాన్ని వైద్య విద్యార్థుల విద్య కోసం కాకతీయ మెడికల్‌ కాలేజీకి అప్ప చెప్పారు స్నేహితులు. శ్రవణ్‌ ఈ బాధ్యతను తీసుకున్నాడు. రజిత ఉన్నప్పుడు ఆశ్రితులకు, ఆర్తులకు, పీడితులకు, దళితులకు అండగా ఉండి తను వెళ్లాక ఇద్దరికీ కనుచూపు ప్రసాదించడమే కాకుండా, కాలమే డాక్టర్లకు వైద్యము నేర్పుకునేందుకు తన శరీరమును ఇచ్చి ‘‘రజిత కొండ’’గా నిలిచింది. అందరిలో ‘‘వెండి వెలిగై ప్రకాశిస్తున్నదే ప్రకాశిస్తున్నది.
అంతేనా… అంటే ఈ దేశపు నేల మీద తన సహృదయ పరిమళాలను పంచింది. ఎందరికో తను అక్క, చెల్లి అమ్మగా వారి ఎదలలో నిలిచింది. అందుకే తను సన్నజాజి పరిమళాల గుత్తి. ఆత్మీయతకు పతాక. హిమవన్నగా కేతనం.
అనిశెట్టి రజిత స్మృత్యర్థం.

Share
This entry was posted in రజిత స్మరణలో. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.