నేను తల వాల్చేందుకు తన భుజం కావాలనుకుంటాను.
తను మాత్రం నా భుజం పైనే చేయి వేస్తాడు.
నేను తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోవాలనుకుంటాను.
తను మాత్రం నా కళ్ళ వైపే శీత కన్ను వేస్తాడు.
నేను తన సాంగత్యంలో మౌనంగా, హాయిగా గడపాలనుకుంటాను.
తను మాత్రం నా సాంగత్యం మాత్రమే ఆశిస్తాడు.
నేను తన తలపులలో నా హృదయోల్లాసం పొందాలనుకుంటాను.
తను మాత్రం నా పొందులోనే ఉత్తేజిత ఉల్లాసం చూస్తాడు.
నేను తనెప్పుడూ నా ఆలోచనల్లో మునిగి ఉండాలనుకుంటాను.
తను మాత్రం నా స్పందనల వర్షపు హోరులో తడవాలనే తలుస్తాడు.
నేను నా ప్రతిభతో, ఆత్మ విశ్వాసంతో ప్రపంచాన్ని జయించినా…
తనకు, తన ప్రేమకు బానిసలా ఉండిపోవాలనుకుంటాను.. ఎందుకో!
అదేమి చిత్రమో…
ఈ ఒక్కటి మాత్రం తనూ అదే అనుకుంటాడు.
తన ప్రేమకు కాకున్నా..
తనకు మాత్రం నేను జీవితాంతం బానిసలా లొంగి ఉండాలని
నా ఆలోచనతో ఏకీభవిస్తాడు.
