నాడు రాజ్యాల నేలిన రాజుల నుండి
నేటి ప్రజా ప్రభుత్వాల వరకు
కవులను గౌరవిస్తూ, కవిత్వాన్ని ఆస్వాదిస్తూ….
భాషలు అంతరించకుండా, ప్రాణం పోసే చికిత్సే
ప్రపంచ కవితా దినోత్సవం
ఐరోపాలో మొదలైన కవితా దినోత్సవం
కొత్త పుంతలు తొక్కుతూ,
సంస్కృతి ,సంప్రదాయాలను,
సామాజిక న్యాయంపై అవగాహన కల్పిస్తూ,
కొంగ్రొత్త ప్రక్రియలతో
పాఠకుల మదిని చూరగొంటూ,
భాషాభిమానాన్ని చాటుతూ,
భావికి పునాది వేస్తోంది
ప్రకృతి పలుకరింతలతో
సంతోషం, బాధల భావోద్వేగాలను పంచే,
ప్రతికదలిక ఒక పద్యమై,
పిల్ల తెమ్మరల పిలుపులతో
మది మదిలో మెదిలే భావనల
అక్షర రూపాలే కవితా కాన్వాసై కలకాలం నిలుస్తోంది
బంధానుబంధాలు,
ప్రేమ, ఆప్యాయతలు
మనసును దోచే పూల తెమ్మెరగా…..
ప్రేమ అనే రెండు అక్షరాల తలపులతో
పెదవి దాటి, మదిని మీటి
తన్మయమందించే తనువు
మై మరిపించే
మధుర భావనే కవితగా క్షరంలేని అక్షరమై నిలుస్తోంది
మైమరపించే మధుర భావనలందించి,
నిస్వార్దమే నీ గమనమంటూ
ఐకమత్యంగా అలుపు లేని సేవలు చేస్తూ…..
జగతిని ఆనందింప చేసే ప్రకృతిలా….
అహపు ఆలోచనలు వీడి,
‘నేను’ అనే పదం మరచి
మనమంటూ మదిని గెలిచి
కులం, మతం ,కుళ్ళు కుతంత్రాలను మరచి,
ఐకమత్యపు బాటలో నడుద్దాం
అందరం ఒక్కటై నిలుద్దాం
