ఆమె ఇక లేదు – జీ. శ్యామల

ఆమె రోజులాగే తన ఇంటి ముందే ఉంది
ఆమె రోజులాగే అందరి మధ్యే ఉంది
ఆమె చుట్టూ రోజులాగే

జనమంతా కూర్చొని ముచ్చటిస్తున్నారు
ఆమె ఇంటి ముందు నుండి రోజులాగే
నచ్చినవారు నచ్చని వారు నడుస్తున్నారు
ఆమె రోజులాగే తన వీధంతా చూస్తుంది నిశ్శబ్దంగా…
కానీ ఈ రోజు ఈ వేళ
ఆమె ఎవరికీ స్పందించలేదు
ఎవరికి సపర్యలు చేయడం లేదు
టీ, నీళ్లు ఇచ్చి మర్యాదలు కూడా చేయడం లేదు
ఆమెకి ఎవరి మాటలు చెవికెక్కడం లేదు
ఆమె ఎవరి బాధకి ఓదార్పునివ్వటం లేదు
ఆమె ఎవరి కన్నీళ్లకు అడ్డుకట్ట వేయట్లేదు
ఆమె ఎవరి ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదు
ఎవరి పగా, ప్రతీకారాలు శాశ్వతం కాదని,
భూమిపై ‘జీవం’ అనే నాదం మోగే వరకే అన్నీ అంటూ
అన్యాయంగా అనంతలోకంలో కలిసి
అసలే తిరిగి రానంటూ తెగేసి, తెల్చేసింది
సింగారించి బంగారింటికి పంపేయమని
ఏ సైగా చప్పుడు చేయకుండా మౌనంగానే చెప్పింది
చాకిరికి, బాధ్యతలకు, బంధువులకు జవాబుదారి ఎవరంటే
ఆ భగవంతుడే అన్నిటికి మÖలం అంటూ వీడ్కోలు పలికింది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.