గొంతెత్తలేనివారి కోసం గొంతు విప్పిన వీర్ పాల్ కౌర్ – మకాం

“భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అతను తన భార్యకు మిగిల్చి వెళ్లే కష్టాలను ఎవరు పరిగణనలోకి తీసుకోరు” అంటారు. వీర్‌పాల్ కౌర్, ఆమె తండ్రి, మామ, భర్త, వీరందరు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్య చేసుకున్నవారే.

ఈ హృదయ విదారక విషాదాల రూపంలో వీర్‌పాల్ తన తల్లి, అత్తగారు, ఇప్పుడు తాను ఎదుర్కొంటున్న కష్టాలను చాలా దగ్గరగా చూశారు. కేవలం 44 సంవత్సరాల వయసున్న వీర్‌పాల్, చాలా వయసు మీద పడినట్లుగా, జీవితకాలంమంతా ఒత్తిడికి, తీవ్ర మనోవేదనకు లోనై, అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారు.
వ్యక్తిగతంగా తాను కూడా నష్టపోయినప్పటికీ, వీర్‌పాల్ రైతు ఆత్మహత్యల్లో బాధిత కుటుంబాలకు చెందిన వందలాది మంది మహిళలకు గొంతుకగా మారారు. ఆమె తన బాధను ఒక ప్రయత్నంగా మారుస్తూ, ఆ మహిళల గుర్తింపును, మద్దతును డిమాండ్ చేసేలా వారిని సంఘటితం చేస్తారు. ఎవరూ మిగలని తన అత్తగారి ఊరైన సౌరాను విడిచిపెట్టిన ఆమె, ప్రస్తుతం పంజాబులోని మాన్సా బ్లాక్‌లో ఉన్న స్వగ్రామం రల్లాలో తన సోదరుల ఇంటికి దగ్గరగా నివసిస్తున్నారు.
వీర్‌పాల్ ఎనిమిదవ తరగతిలో ఉండగా, ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. బలవంతంగా చదువు మానేయాల్సి వచ్చిన ఆమె, కుటుంబాన్ని పోషించడానికి, తన తోబుట్టువులు తమ చదువులను కొనసాగించడానికి, తన తల్లితో కలిసి రైతు కూలీగా పనిచేయటం మొదలుపెట్టింది. పదహారు ఏళ్ళకే వివాహమైన ఆమె, నిర్దయ నిండిన కష్టాల జీవితంలోకి ప్రవేశించింది. వరుసగా ఆర్థిక నష్టాలు చవిచూసిన ఆమె మామగారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఇప్పుడు వీర్‌పాల్, ఆమె అత్తలపై పడింది. ఆ తరువాత వీర్‌పాల్ భర్త వ్యవసాయం చేపట్టారు. కానీ పదే పదే పంటలు నష్టపోవడం, అప్పులు పెరగడం, వారి రెండున్నర ఎకరాల భూమిని అమ్మడం అతన్ని నిరాశలోకి నెట్టేసాయి.
“అప్పులు తీర్చటానికి అతను భూమిని అమ్మేశాడు,” అని వీర్‌పాల్ గుర్తు చేసుకున్నారు. “ఆ తరువాత అతను ఒక దుకాణాన్ని నడిపించడానికి, స్కూటర్ మెకానిక్‌గా పనిచేసేందుకు ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవీ పనిచేయలేదు”. 2003లో పిల్లలను పోషించే బాధ్యతను వీర్‌పాల్‌కు వదిలి అతను ప్రాణాలు తీసుకున్నారు. ఈ విధంగా ఆమె కుటుంబం ఆత్మహత్య, వినాశకర ప్రభావాన్ని మూడు తరాల పాటు ఎదుర్కొన్నది. ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ వీర్‌పాల్ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించారు. ఎందుకంటే ఆమెకు ఉన్న అప్పు మూడు లక్షలలో కొంత భాగం ప్రైవేటు వడ్డీ వ్యాపారి నుండి తీసుకున్నది. “వ్యవస్థను ఎలా నడిపించాలో తెలుసు కాబట్టి, పెద్ద రైతులు, విద్యావంతుల సహాయం పొందగలరు. కానీ మాలాంటి చిన్న రైతులకే కష్టాలు” అని ఆమె వివరించారు. ఈరోజున ఇంకా చెల్లించలేకపోయినా ఆమె అప్పు రూపాయలు ఎనిమిది లక్షలకు పెరిగింది. నేను గ్రామపంచాయతీ నుండి ఆసుపత్రి నుండి అవసరమైన అన్ని రుజువులను సమర్పించాను. కానీ ఏమీ జరగలేదు అని ఆమె చెప్పారు. తన పిల్లలను పోషించుకోవడానికి వీర్‌పాల్ తనకు దొరికిన ప్రతి పనిని చేశారు. ఆమె ఇంటి పనిమనిషిగా పని చేశారు. ఇంటింటికి వెళ్లి గాజులు అమ్మారు. సుల్హాలు (పొయ్యిలు) తయారు చేసి అమ్మారు. బట్టలు కుట్టారు. వ్యవసాయ కూలీగా కూడా పనిచేశారు. ఆమె ఒక దుకాణం నడిపే ప్రయత్నం కూడా చేశారు. కానీ కొనేవాళ్ళు అప్పు మీద వస్తువులు తీసుకువెళ్లి తిరిగి చెల్లించలేదు దాంతో ఆమె దానిని మూసేయాల్సి వచ్చింది. 2005లో ఆమె అంగన్వాడి సహాయకురాలిగా పనిచేస్తూ ఒక స్థిరమైన ఆదాయాన్ని సంపాదించగలిగారు. “మా అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ లేదు, నీరు లేదు గ్రామీణ విద్య మౌలిక సదుపాయాల దారుణమైన పరిస్థితులను ఎత్తి చూపుతూ అన్నారామే.
తన పిల్లల చదువుకు ఆసరా ఇచ్చినందుకు వీర్‌పాల్ సహాయతా క్లబ్, ఏక్తా ట్రస్టులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూపర్వైజర్‌గా పని చేస్తున్న ఆమె కుమారుడు ఆమెతో కలిసి ఉంటున్నాడు. న్యాయవాది అయిన ఆమె కుమార్తెలు థియానాలో పనిచేస్తుంది.
నా కుటుంబంలో ఎవరు మత్తు మందులు బానిసలు కాలేదు. నా కొడుకు గాని నా భర్త కానీ గర్వంగా చెప్పారామె. ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక సాధారణ విధానంగా వ్యసనానికి బానిసలై విలవిలలాడుతున్న ప్రాంతంలో ఇది చాలా అరుదైన విజయమే.
న్యాయం గాని భరోసా కానీ లభించని వీర్‌పాల్ తన దుఃఖాన్ని క్రియాశీలకంగా మార్చుకున్నారు. ఆమె తన గ్రామంలో సుమారు 50 ఆత్మహత్యల బాధిత కుటుంబాలను సమీకరించి ఆ బాధ్యత కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిహారం వంటి ఇతర సమస్యలను పరిష్కరించే రాష్ట్రస్థాయి వేదిక అయినా ఖుద్‌ఖుషి పీడిత్ మహిళా సంఘటనతో అనుబంధించారు. ఆమె తన గ్రామంలోని మహిళలు ప్రభుత్వ గృహాలను పొందేలా సాయం చేస్తూ గృహహింసను పరిష్కరించడంలో మహిళలకు మద్దతు ఇస్తున్నారు. రైతు ఆత్మహత్యల బాధిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత విపులంగా ఎలుగెత్తి చాటడానికి వీర్‌పాల్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వనరులు లేకపోవడంతో ఆమె ఒక ఆటో రిక్షాలో స్థానిక మహిళల మద్దతుతో ప్రచారం చేసి 3100 ఓట్లతో సాధించారు.
“నేను చాలా దూరాలు ప్రయాణించాను, కార్యక్రమాలలో మాట్లాడాను, ఐదు నుండి 50 ఏళ్ల వయసు గల మహిళలను సమీకరించాను. వారిని కార్యక్రమాలకు తీసుకెళ్లాను” అని ఆమె చెప్పారు. కానీ ఏమీ మారలేదు ‘ఏమిటి ప్రయోజనం’ అని మహిళలు కూడా నన్ను అడుగుతారు. ప్రభుత్వం చేసింది ఏమి లేకపోయినప్పటికీ అప్పుల నుంచి ఉపశమనం కోసం, తనకు ఇతరులకు న్యాయం సాధించటం కోసం చేస్తున్న తన పోరాటంలో వీర్‌పాల్ దృఢంగా నిలిచారు.
(భవిష్యత్తును అభివృద్ధి చేసుకుంటూ… మహిళా రైతుల గురించి ఫోటో వ్యాసాలు పుస్తకం నుండి..)

Share
This entry was posted in మహిళా రైతుల జీవన పోరాటాలు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.