బ్రెయిన్‌ ‘వాష్‌’ !

పసుపులేటి గీత
ఒక యువతి భర్తకి కాఫీ తెచ్చి ఇస్తుంది. భర్త ఆమె ముఖం కూడా చూడకుండా న్యూస్‌పేపర్‌ని చదవడంలో లీనమై పోతాడు. దాంతో ఆ మహిళ నిరాశ చెందుతుంది. వెంటనే మనకు స్త్రీ నగ్న శరీరంతో ఒక డ్రాయింగ్‌ కనిపిస్తుంది. ఆ డ్రాయింగ్‌లో యోని భాగం నల్లగా ఉంటుంది. ఆ వెనువెంటనే ‘క్లీన్‌ అండ్‌ డ్రై ‘ వాళ్ళ ‘ఇంటిమేట్‌ వాష్‌’ గురించిన సందేశం వినిపిస్తుంది.
తరువాతి ఫ్రేమ్‌లో ఆ జంట నవ్వుతూ, తుళ్ళుతూ ఇల్లంతా కలియతిరుగుతుంది. అంటే ఆ యువతి  యోనిభాగం తెల్లగా ఉండడం వల్ల భర్త ‘ప్రేమ’ (?) ను పొంద గలిగిందన్నది క్లీన్‌ అండ్‌ డ్రై వాళ్ళ వాణిజ్య ప్రకటన సారాంశం. టివీల్లో ఊదరగొట్టేస్తున్న ఈ నవీన భారతీయ ప్రకటన మీద నేషనల్‌ జియోగ్రాఫిక్‌, టైమ్‌ వంటి పాశ్చాత్య వార్తాసంస్థలు కూడా ముక్కు మీద వేలేసుకుంటూ వార్తాకథనాల్ని ప్రచురిస్తున్నాయి. నలుపు అన్నది మహానేరమన్న సామ్రాజ్యవాద ప్రచారం చివరికి మన మహిళల మర్మాంగాల్ని సైతం వదిలి పెట్టడం లేదు. అంతేకాదు బాహుమూలాల్లో వాడే డియోడరెంట్లు మొదలుకుని, ఈ ‘స్కిన్‌వైటెనర్ల’ వంటి సౌందర్య సాధనాలపట్ల భారతీయ యువత విపరీతమైన మోజును పెంచుకుంటోందట. తెల్లటి దేహం ఇప్పుడు భారతీయ యువతకు అత్యంత ప్రధానమైన విషయమై పోయింది. దీని వెనుక ఒక ఆర్థిక కోణం కూడా వుంది. అదేమిటంటే, అమెరికాలో నివసిస్తున్న ప్రవాసుల్లో తెల్లని మేనిఛాయ కలిగిన వాళ్ళు, మిగిలిన ప్రవాసుల కంటే 16 నుంచి 23 శాతం వరకు ఎక్కువగా వేతనాల్ని , ఉద్యోగ అవకాశాల్ని పొందుతున్నారని వాండర్బిట్‌ లా స్కూల్‌కు చెందిన జోనీ హెర్ష్‌  చెబుతున్నారు. ఎంత ‘వెనక్కి’ పోతున్నాం?! మహిళల దేహాల్లో చివరికి వాళ్ళ మర్మాంగాల మీద కూడా వారికి స్వామ్యం లేకుండా పోతోంది. ఎంత చదువుకున్నా, ఎంత సాధించినా మహిళ, పురుషుడి దృష్టిని ఆకర్షించాల్సిన వస్తువే. అలా ఆకర్షించడమే ఆమె స్త్రీత్వానికి కొలమానం. మహిళల్ని అనాదిగా భోగవస్తువులుగా చూసే మన సంస్కృతి విషపు కోరల నుంచి భారతీయ మహిళ ఇంకా బయటపడకముందే, సామ్రాజ్యవాదం కూడా తన వాణిజ్య లక్ష్యాలకు మహిళలనే ఒక ఉపకరణంగా చేసుకోవడం మరో శాపంలా పరిణమిస్తోంది. అధిగమించే కొద్దీ అగాథాలే ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళలు కనీసం బహుళజాతి సంస్థల వలలో పడకుండా తమను, తమ వ్యక్తిత్వాల్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తెరగాలి. భారతీయ వాణిజ్య ప్రకటనా రంగంమీద ఈ దిశగా తగిన నియంత్రణల్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గుర్తెరగాలి. భారతీయ వాణిజ్య ప్రకటనా రంగంమీద ఈ దిశగా తగిన నియంత్రణల్ని విధించేలా ఒత్తిడిని పెంచగలగాలి. ఇంతా చేసి ఈ స్కిన్‌ వైటెనర్లు, లైటెనర్ల వల్ల చర్మానికి తీరని హాని కలుగుతుందన్నది వైద్యుల అభిప్రాయం.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

3 Responses to బ్రెయిన్‌ ‘వాష్‌’ !

  1. nirmala says:

    chaalaa baavundi.

    nirmala kondepudi

  2. buchi reddy says:

    తెలుపుకు విలువ యెక్కువ——??? యెంధుకొ–దెనికొ ??
    భా గ చెప్పారు-
    —————————–

  3. sivalakshmi says:

    సర్వం కొనడం – అమ్మడమే అయిన మూర్ఖ ప్రపంచం లో సామ్రాజ్య వాద ఉడుం పట్టు వల్ల మన మహిళలు సమిధలవుతున్న విధం గురించి గీత చాలా బాగా చెప్పారు.కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.