డి. చంద్రకళ
మహిళలు మగవారితో సమానంగా బయట అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు
ఇంట్లో హింస గురించి మాత్రం అడగొద్దు!!
పంచభూతాల్లో ఎక్కడైనా – ప్రపంచదేశాల్లో ఏ చోటైనా పనిచేయగల్గుతున్నారు.
భూగర్భంలోనైనా సరే (కుటుంబ యజమాని బాధ్యత నుంచి తప్పుకుంటే)!!
సీతలకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చేసింది.
సంపాదించే విషయంలో మాత్రమే!!
సీ్తలు బయటి పప్రంచంలో తలెత్తుకు తిరగ్గల్గుతున్నారు
సూటిగా చూసే పురుషుల చూపుల్ని తట్టుకోలేక!!
సీతలు అర్థరాతి కూడా స్వేచ్ఛగా ప్రయాణాలు చేయగల్గుతున్నారు.
కాల్సెంటర్లో జాబ్ చేయాల్సి వస్తే!!
కుటుంబ బాధ్యతల్నీ, వృత్తిబాధ్యతల్నీ సంయమనంతో నిర్వహిస్తున్నారు.
రెట్టింపు బరువు బాధ్యతల్ని, ఒత్తిడినీ తట్టుకుంటూ!!
పురుషులు సీతలకు ఇంటిపనుల్లో సాయపడ్తున్నారు.
ఇంటా బయటా పనిచేసి ఎక్కడ అనారోగ్యం పాలవుతుందోనని!! (వైద్యం ఖర్చు తప్పుతుందని)
గృహహింసపై చట్టం వచ్చేసింది
చట్టానికి దొరికేట్టు చేస్తారేమిటి?!
ప్రేమ్ర వివాహాలకు ఆదరణ పెరుగుతోంది
ప్రేమ పేరుతో హత్యలూ జరుగుతున్నాయ్!!
సీత అంటే ఆదిశక్తి అవతారం
మరి అత్యాచారానికి బలవుతోన్న నాలుగేళ్ళ పసికూనసంగతో?!
లెక్కకు ‘రాని’ భూణ్రహత్యల మాటో?!
పుతుడ్రు పున్నామనరకం నుంచి తప్పిస్తాడట.
భూలోకంలోనే నరకాన్ని చూపిస్తాడట కూడా!!
స్తీక్రి సహనం ఎక్కువ
ఎంతటి హింసనైనా నోరెత్తకుండా భరిస్తుంది!!
సీత తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు.
తలచుకోవటానికి సమయమూ, అవకాశమూ వున్నప్పుడు!!
సీతలు రాజకీయ రంగంలోనూ ‘రాణి’స్తున్నారు.
సొంత గొంతుక లేకుండా!!
ఆడపిల్లల్ని కూడా మగపిల్లల్తో సమానంగా చదివిస్తున్నారు.
కొడుకుల చదువుకు పోగా మిగిలినదాంతో!!
పెళ్ళితోనే ఆడదాని జీవితానికి పరిపూర్ణత
అందుకేగా మరి – బాల్యవివాహాలూ, బలవంతపు వివాహాలున్నూ!!
మాతృత్వంలోనే ఉంది ఆడజన్మ సార్ధకం
అందుకే ఇక్కడ అతి సులభంగా అద్దెకు కూడా దొరుకుతోంది!!
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు
పదిహేనేళ్ళకే ఇల్లాలవుతే అంతేమరి!!
ఇల్లాలి ఆరోగ్యమే కుటుంబానికి శ్రీరామరక్ష
పస్రూతి మరణాన్నించి బ్రతికి బయటపడితే!!
అందరికీ అందుబాటులో వైద్యం
యూజర్స్ ఛార్జీలు మాత్రం అదనం!!
సీతలు – ఆకాశంలో సగం!
నిజమే! ఎయిడ్స్ కేసుల్లోనూ!
చాలా బాగు0ది-ఈ మగ పెత్తనము పోయేదాకా పోరాడాలి-వీలు0టే మన లను మనము కాపాడు కొ0టూ