మరాఠీ మూలం – డా|| శైలలోహియా
అనువాదం : ఆచార్య ఎస్ శరత్జ్యోత్సారాణి
నేను ఆడదాన్ని
నేను తల్లిని
నేను చెల్లిని
నేను ఇల్లాలిని
నేను ఆడదాన్ని
నేను ఒక అమ్మను
కోడి కూసినప్పటినుంచి
రెక్కలు ముక్కలు చేసుకుంటూ
బండెడు చాకిరీ చేస్తున్న అమ్మను
కొన్నాళ్ళు వరిపొలాల్లో
కొన్నాళ్ళు బంజరుభూముల్లో
కొన్నాళ్ళు ఇంటి కార్ఖానాలో
రేయింబవళ్లు శమ్రించే ఆడదాన్ని
నేను ఆడదాన్ని
నామానాన్ని అభిమానాన్ని హరించినపుడు
చింకి పాతను చుట్టుకున్నాను
దీనికి నల్లరేగడి సాక్షి
నీకు నిందలు కర్కశముటలే మిగిలాయి
నీకు పత్రి ఇల్లు పత్రి గుడిసె
జీవితం చెర
అయితే నేడు
నా వంటింటి నుంచి
అరుణోదయమయింది
పీడితతాడితుల బాధలు
పంచుకోకపోతే
నా కష్టాలు పోవనే వాస్తవాన్ని
నేను తెలుసుకున్నాను
బానిసబిడ్డ
స్వేచ్ఛావిహంగం ఎలా అవుతుంది
ఓ అన్నలారా!
ఓ పిల్లలారా!
నా ఇంటాయినపైన పగద్వేషాలు లేవు
సమాజంపైనా లేదు
నా అయ్యమీద పిసరంత కూడలేదు
వేదమంతాల్రు వల్లించే మతపెద్దలు
మా ఆలోచనలను బంధించారు
మా తలలను నరికేశారు
వారే నా పశ్న్రలకు
జవాబు చెప్పాలి
ఓ బిడ్డ
ఇప్పుడు మీ అమ్మ
ఓ మనిషిలా బత్రకాలనుకుంటుంది.