పుట్ల హేమలత
నీడగానే సాగాలన్నచోట
గోడగానే మారాలి
శలభానివి కావల్సిన చోట
పమ్రిదగానే వెలగాలి
పేమ్రాలింగనాల కొలిమిలో
అభిమానం అడుసుగా మారుతుంది
కోరికల జిగినీ పరదాల మాటున
నగిషీలు చెక్కిన గాయం
కాష్మోరాలా నిదల్రేస్తుంది
సవ్రించే పుండుని ముట్టుకోనేలేరు
వైతరణి కూడా
సుగంధభరితంగా పవ్రహించాలి కాబోలు
కిలికించితాల అలల మీద
అహంకృత గరళవస్త్రం కప్పుకుంటుంది.
ఇప్పుడు కొత్తగా ఏంటి?
హృదయ పరిచ్ఛేదన
యుగాల నాటిది
ఏ అభిజాత్యపు క్షణమో
నిన్ను నిన్నుగానే చూడాలనుకుంటుంది
ఒక్కొక్కసారి
సన్యాసపు సహజీవనాలు
ఎంత మధురంగా వుంటాయి!
నిన్ను నువ్వు గెల్చుకున్న
ఒక్కొక్క క్షణమూ
ఒక మూలరాయి అవుతుంది
పెనుగాలికి కూలిన మాను…
మనసు చచ్చిన మానవి…
తేడా ఏముందని?
దుఃఖపు మూలాల్ని
వేరుపురుగు తొలుస్తూనే వుంది
కీటకనాశని చల్లండి
గుండెగాయం
ఇంకా ఆరనే లేదు.