భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కధ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. వ్యాసం ”మహిళలపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులు – పరిష్కారాలు” అనే అంశం మీద రాయాలి.
ఓ రచనలు సరళంగా, సూటిగా వుండాలి.
ఓ పేపర్‌కు ఒకవైపు మాత్రమే స్పష్టంగా రాయాలి. డి.టి.పి. చేయించి పంపితే మరీ మంచిది.
ఓ కవరు మీద కథ, వ్యాసం, కవితల పోటీ కోసమని రాయాలి.
ఓ పోటీకి పంపిన రచనలు ఎట్టి పరిస్థితిలోను తిరిగి పంపబడవు కాబట్టి కాపీలను మీ వద్ద ఉంచుకోగలరు.
ఓ న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
ఓ కథల విభాగంలో రెండు, వ్యాసం విభాగంలో రెండు, కవితల విభాగంలో రెండు బహుమతులుంటాయి.
ఓ బహుమతి గెల్చుకున్న రచనలతో పాటు, ఎంపిక చేయబడిన వాటిని వీలు వెంబడి భూమికలో ప్రచురిస్తాం.
ఓ కథ నిడివి అచ్చులో (ఎ4సైజ్) ఆరు పేజీలు, వ్యాసం అచ్చులో (ఎ4సైజ్) పది పేజిలుండాలి.
ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
రచనలు భూమిక కార్యాలయానికి అందవలసిన చివరి తేది. సెప్టెంబర్ 15, 2013స్త్రీవాద పత్రిక భూమిక
హెచ్ఐజి-2, బ్లాక్-8, ఫ్లాట్-1, బాగ్‌లింగంపల్లి, వాటర్‌టాంక్ వెనుక, హైద్రాబాద్ – 500 044.
ఫోన్ నెం. 040-2766 073, ఫ్యాక్స్ 040-27605316