మాది స్జేజి కింది బతుకేనా

జూపాక సుభద్ర

గా మద్దెన ఓ బహుజన పెద్దమనిషి మా దళిత బహుజన కులాలల్ల ఆడోల్లకు మస్తుగ స్వేచ్ఛలు, సమానత్వాలున్నయి, పెద్దకులాల ఆడోల్లకున్నన్ని కట్లు, కచ్ఛడాలుండయి. వాల్లు బడ్తున్న సెరలు మా ఆడోల్లు బడ్తలేరని తీర్పిచ్చిండు.

గా సంగతిని గా మొగోల్లుగాదు సెప్పేది, గా ఆడోల్లను సెప్పుమంటే గా గోడేంది, గోసేందనే నిజాల్ని నిప్పులోలె తర్పారబడ్తరు. ఓడిపోయినోల్ల కింద వోడిపోయినోల్లు దళిత బహుజన ఆడోల్లు. మా ఎల్లమ్మల్ని, పోషమ్మల్ని జెప్పమంటే ఈకె తోకలు బీకి సెప్తరు.

బైటికి బొయి మొగోల్లతోని సవనంగ కూలికైకిలి జేసే స్వేచ్ఛలు, మేమే యింటిని, పోరగాండ్లను నడిపేకాడ, కూరలకు నారలకు, వుప్పుకు తొక్కుకు లేకున్నా, పొయి మీదికి పొయి కిందికి అన్ని మేమే ససుకునే ‘ప్రజాస్వామ్యాలు’, కలిసి కల్లుదాగే సమానత్వాలు మాకు మాగ తలగవడ్డయి. స్వేచ్ఛలు సమానత్వాలంటే గివేనని నలుగుట్లెవెట్టి మాతోనే పంచాజ్జేస్తె తెలుస్తయి.

మాకు పొయికాడ స్వేచ్ఛలుగాదు బొడ్రాయికాడ గావాలె. గీ దళిత బహుజన కులాలు ఆడ పెత్తనాలున్న కులాలుగుండె. గిప్పుడు మెల్లమెల్లగ మమ్ముల్ని ఎనుకకు దొబ్బుతున్నరు గీ మొగోల్లు. పెద్దకులాల పార్లీలల్ల లేము. గీ దళిత కులసంఘాలల్ల గాడ గంజిలొక్క మెతుకోలె గాడ లేకపోతిమి దండోరకాంచి నంగారదాక ఒక్క ఆడామె యినబడది, కనబడది.

గీల్లే పెద్దకులాల రాజకీయ పార్టీలల్ల ఆడోల్లులేరని, కింది కులాలకు అవకాశా ల్లేవని, అనిసిపెడ్తున్నరని మొత్తుకునే వీల్లు జేసేదేంది గా కులపోల్లనీతే వెస్తుండ్రు. పెద్దకులాల పోకడలను ఎదిరించుడు బాగనే వున్నది గానీ మల్లా వాల్ల బాటల్నే నడుసుడు విషాదం. యేడ జూసినా ఏడేవన్కలన్న ట్లున్నరు ఆడోల్లు. ఆడోల్లనింట్లబెట్టి, పనిల బెట్టి మొగోల్లు బైటి ప్రపంచాల్ని యెలిగిద్దామనుకుంటుండ్రు.
అవసరమనుకుంటె అల్లిరాణి రాజ్యాలు న్నయి పురాణాలల్లగానీ అర్జున రాజ్యాల్లేవు అనే సంగతులు తెలువక ఆడోల్లను దూరం బెడ్తుండ్రు.
సమసమాజమే మా ఆకరి కోరికనే కమ్యూనిస్టు విప్లవ పార్టీలల్ల వాల్ల ప్రజా సంగాలల్ల కన్ను బొడుసుకున్నా ఆడ నాయకత్వాలే కనబడయి గానీ క్యాడర్‌గ కడుపునిండుగుండాలె.

ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న పాలక పక్షాల నుంచి ప్రగతిశీల తెలంగాణవాదులమని చెప్పుకుంటున్న మేధావుల సంగం నుంచి ఆడిపాడే ధంధాం దాక స్జేజి మీద ఆడోల్లు అగుపియ్యరు.
మాది మాతృస్వామ్య విలువలున్న కులాలని గర్వంగ జెప్పుకునే మాదిగ మాల దళిత కులసంగాలల్ల గడ ‘ససుకోని మురువ సెప్పుకొని యేడ్వ’నే ఆడోల్ల కత. దళిత మహాసభ, మాదిగ దండోర, మాల మహానాడు, బీసీ సంగాలల్ల, నంగార, ఎరుకలి సంగాల దాకా ఆడనలుసే అగపడది. స్జేజి కింద మాత్రం కండ్లనిండ కలకల్లాడాలెనని కోరుతరు. యిగ కొంతమంది లీడర్లయితే వాల్లాడోల్లను స్టేజి కిందిగ్గడ రానియ్యరు. గివి వాల్ల సామాజిక వుద్యమ న్యాయలు.
జెండర్‌ సమన్యాయం కావాలెనని కొట్లాడే, మాట్లాడే ఫెమినిస్టు నాయకత్వాలు ఒకే జెండలున్న అసమానతల్ని వాటిక్కార ణమైన కులపునాదుల మీద ఎసోంటి ఎజెండాలు, ప్రోగ్రాంలు లేవు. యిక్కడ కూడ దళిత, బహుజన మైనారిటీ ఆడోల్లు ఫెమినిస్టు వేదికల కిందోల్లే….
సరేగియన్ని పెద్దకులపోల్ల పార్టీలని, సంగాలని గీల్ల పోకడే అన్యాయంగుంటదని దాంట్లెకి కింది కులాలోల్లను రానియ్యరని అనుకుందాం. మరి కింది కులాల సంగాల సంగతేంది? అని అడుగుతున్నం. మాపా లేంది, మా నాయకత్వమేందని అడుగు తున్నం. మేము లేందే మీరు లీడరుగిరి యేడజేద్దురనేది యదిబెట్టుకోండ్రి.

10, 20 ఏండ్ల నుంచి కులసంగా లొచ్చినయి. ఒక్క కులసంగల ఆడోల్లు కనిపియ్యక పోడానిక్కారణం ఆడోల్ల ప్రాతినిధ్యాల పట్ల అసహనం. నిత్యం అంబేద్కర్‌ను యజ్జేస్కుంటరుగానీ ఆడమగ సమానమని, ప్రత్యేకంగ ఆడోల్ల కోసం పదవినే వదిలేసిన అంబేద్కర్‌ ఆదర్శాల్ని అమలుచేయరు. ఆడోల్లను రానియ్యకుండా మా ఆడోల్లకు సమానత్వాలుంటయంటే మేమెట్ల నమ్మాలె. మహాజన సంగాలల్ల, సర్వజన సమ్మేళనాలల్ల, బడుగు బలహీన వర్గాల సమీకరణలల్ల మా పాలేంది, మా ముచ్చటేంది? ఐపు, ఔపు, ఐఊ, మైనారిటీ సాధికార వేదికల మీద, సమాన న్యాయల ముందట, సామాజిక కూటములల్ల గొంతెక్కడ? మా రాజకీయ సాధికారతలు అక్కెరలేదా! యీ కులసమాజంల అన్ని రకాల తట్లు, పోట్లు అనుభవించి అంగలార్సేది మేమే. రాజకీయం రాజ్యం అనే మాటొచ్చె టాలకు మమ్ముల బాయిల నూకుతరు. గిది మీ రాజకీయం. ఏ రాజకీయ సమీకరణలల్ల స్టేజి మీద పైకెత్తే సేతులల్ల ఒక్క ఆడపురుగు కనపడితే మీ కిరీటాలు కిందపడ్తయ. గీ కులాల కుప్పలున్న దేశంల ఒక్క దళిత పోటుగానికి గాడ సాధ్యంగాని రాజ్యాధి కారాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ల చమర్‌ కులపామె వయవతికే సాధ్యమైందనే సంగతి యదుంచుకుంటే మంచిదేమో.

అయితే బాధాకరమేందంటే యిక్కడ మాయవతి విజయసభ వెట్టి గా సభకు వొక్క ఆడామెను గాడ పిలువకుంట సక్సెస్‌ అని సంకలు గొట్టుకుండ్రు.రేపటి కాలమంత స్టేజి మీద మాయవతైజ్‌ కావాలని ఆశిద్దాం.

Share
This entry was posted in మాక్క ముక్కు పుల్ల గ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.