ఎవరొస్తారో తెలియదు
ఎవరు రావాలనో తెలియదు
మనసు వాకిలి తెరిచే ఉంది
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా
ఊసులెన్నో వేచి ఉన్నాయి
పంచుకునే మనసులెవరో తెలియక
చెంతనుండే మనుషులెవరో తెలియక
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా
ఆశలెన్నో తీరక ఉన్నాయి
ఎగసిపడే కెరటాల్లాగా
తీరం తాకేలోపే అణగారినవికొన్నైతే
తీరం తాకాక నిరాశగా
వెనుతిరిగినవి కొన్ని, ఆశల
కెరటాలు పుడుతూనే ఉన్నాయి
ఎందుకో ఆరాటం తెలియక
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా
తేరిపారి చూడు చుట్టూతా
ఆర్చేవారెవరు? తీర్చేవారెవరు?
ఎన్నాళ్ళుంటావిలా?
సమాధిలో శవంలా
రాలిపోయిన ఆకులా
వాడిపోయిన పూరేకులా
ఎండిపోయిన మోడులా
ఏ సన్నటి గాలికైనా
ఎగురుతూ, పడుతూ, లేస్తూ
ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా
ఇదే నీకాఖరు అవకాశం
కాలి బూడిదయ్యేలోపు,
భూమిలో పాతిపెట్టేలోపు
అనన్య శకలాలుగా ఛిద్రమయ్యేలోపు
నీ రూపం అద్రుశ్యమయ్యేలోపు
నీకు నీవు జ్ఞాపకంగా మిగిలేలోపు
మేలుకో
గుళ్ళో టెంకాయల బండలా ఇన్నాళ్ళున్నావు
ధ్వజస్థంభంలా లేచి నిలబడు
గర్భగుడిలో దేముడి ముందే స్థిరపడు
ఎత్తుగా తలెత్తిపైకి చూసేలా నిలబడు
అప్పుడు చూడు క్రిందకి
అందరూ చూసేది నీ పాదాలొంక
అందరు కొట్టేది సలాంలింక
ముందుకొచ్చి జేజేలంటూ
అమ్మగారు, తల్లిగారంటూ
దేముడికన్న ముందు నీకే దండాలంటూ
సాస్ఠాంగపడేవాడొకడైతే,
పొర్లు దండాలెట్టే వాడొకడు
ఎందుకంటే
ఇప్పుడు నువు అమ్మవు కాదు
కోర్కెలు తీర్చే అమ్మోరివి
కోపం వస్తే రక్తం తాగే
కలకత్తా కాళికవి
కడుపులు నింపే గంగమ్మవి
వెర్రెత్తితే వీరంగం చేసే విలయానివి
దయ కలిగితే దారిచూపే దేవతవి
ఎన్నో జీవితాల విద్యుత్దీపానివి.
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
