నలుగురితో నారాయణా .. అది సామాజిక బంధం
పది మందితో పదరా.. అదే ఆనంద మంత్రం
కష్టమొస్తే కళ్ళు సానుభూతికై ఆశగా చూస్తాయి
ఇతరుల చల్లని సేద దీర్పును ఆశిస్తాయి
సిన్మా కెళ్తే హాలంతా నిండితేనే బావుంటుంది
క్రికెట్ స్టేడియం క్రిక్కిరిస్తేనే మజా వస్తుంది
కాల్లో ముల్లు దిగితే పక్క వారి ఓదార్పు నొప్పిని తగ్గిస్తుంది
గుంపులో సానుభూతి సహజ వెల్లువై ప్రవహిస్తుంది
రోడ్ పై పడగానే నాలుగు చేతులు నిన్ను లేపుతాయి
బస్సులో సొమ్మసిల్లితే వాటర్ బాటిల్స్ లైన్ కడతాయి
ఎవరికైనా సమూహమే ధైర్యం ఇస్తుంది
సమాజమే ఆత్మ విశ్వాసం కలిగిస్తుంది
చివరాఖరికి మనుషులందరిదీ ఒక్కిల్లే
ఆపదలో ఆదరిస్తుంది సంఘం అమ్మల్లే
తోటివారితో సామరస్యం ఉండాలి రక్షల్లే
అప్పుడే అందరం నిద్రిస్తాం పాపలల్లే
గుంపును నడుపుకు పోయే పనవుతుంది నీ వల్లే
అందరి మనసుల్ని కలుపు ఒక గొలుసల్లే
జీవుల్ని అనుసంధానిస్తుంది ఒక ఏకత్వం
అందరిలో ఉంటుంది కనబడని దైవత్వం
-
Recent Posts
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
- వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు – డా. సమ్మెట విజయ
- వారసుడే కావాలా? – డా. ఆవుల రేణుక
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
