అమ్మవై బాధ్యతలను పంచుకుంటావు
చెల్లివై నీకేమి కావాలో అరచి తెప్పించుకుంటావు
చెలివై నీకెవరూ సాటిలేరని అనిపించుకుంటావు
అత్తవై కోడలిని శాసిస్తావు
ఆడబడచువై వదినను ఆరళ్ళు పెడతావు
మరెందుకు నువ్వు మౌనంగా కూర్చుంటావు?
నీ ప్రమేయం లేకుండా అఘాయిత్యం చేస్తుంటే
బేలవై ముడుచుకుపోతావెందుకు?
ప్రతిసృష్టికి ప్రతిరూపానివై
ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కుటుంబం
నీకు, నీ సహనానికి నిత్యం పరీక్షలు పెడుతుంటే
అశక్తురాలివై అరుస్తుంటావెందుకు?
అదాకార మధింధంతో కొందరు
తాళిని ఎగతాళి చేస్తూ మరికొందరు
నిన్నొక ఆటబొమ్మను చేసి ఆడిస్తుంటే
తాలాట్టు బొమ్మలా తలాడిస్తావెందుకు?
అంధకారంలోనే మగ్గిపోతావెందుకు?
నాతి చరామి అంటూ ప్రమాణం చేసి
‘అర్థాంగి’ అనే పదానికి అర్థాన్నే మార్చివేస్తుంటే
కుటుంబానికి అర్థం, జీవితానికి పరమార్థమిస్తూ కూడా
సమాన హక్కులకోసం ఇంకా అర్థిస్తావెందుకు?
నిన్ను నువ్వే చులకన చేసుకుంటావెందుకు?
లే!
వంటిల్లు నీదే కానీ
కుందేలువు నీవు కాదని నిరూపించు!
పడకటిల్లు అతనిదే కానీ
చుట్టేసిన పరుపువు కావని చాటిచెప్పు!
అవని నీవే కానీ
ఆకాశం నీ సిగలో భాగమని తెలియజెప్పు!
గతం నీది కాదని నువ్వనుకున్నా
రేపు మాత్రం నీదే!
నిన్న నువ్వు పోగొట్టుకున్న నీ భీతి తాలూకు బొమ్మ
నేడు రేపు నీకు నువ్వు సృష్టించుకున్న జన్మ!ఆడదిగా కనిపించినంత కాలమూ
మన మెదడు పొరల్లో
ఒక స్త్రీత్వపు దీపం వెలిగి
జాత్యహంకారాన్ని కాల్చేయనంత కాలమూ…
శీలం అనేది కొన్ని అంగుళాల, అవయవాల నుండి
తన పరిధిని విస్తరించుకోనంత కాలమూ….
మనకు ఆమె నిశ్శబ్దపు నిషిద్ధ దుఃఖం
అర్థం కాదేమో…..!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చాల బాగుంది