లేదు లేదోయమ్మ.. లేదోయమ్మ..
ఇట్లాంటి మాయమ్మలో కానలేదమ్మ
అయినోల్లు దూరమైనా…
కేసులెన్ని జుట్టుకున్నా…
”పీడిత వర్గాల చెయివీడలేదమ్మ” ||లేదు||
తెల్లజాతోల్లపై ఫైర్ బ్రాండయ్యింది
నల్లజాతోల్లకు దేశమాతయ్యింది
త్యాగాల బాటలో వెనుదిరుగనీతల్లి
”జనహృదయనేతగా కలకాలము నిల్చె” ||లేదు||
నాయకులెందరో జైలుపాలు గాగ
అన్నీ తానే అయి సుడిగాలిలా దిరిగె
తెల్లోల్ల కేమొ చెమట పుట్టించంగ
”యువతగుండెల్లోన తుఫాను రేపింది” ||లేదు||
కక్షగట్టి నట్టి పరాయి పాలనలో
ఎన్నెన్ని శిక్షలో, ఎన్నెన్ని బాధలో-
తనువు, మనసు రెండు నిప్పుల కొలిమైనా
”ఎదురొడ్డి నిల్చింది; ఉక్కుమనిషయ్యింది” ||లేదు||
తెల్లోల్లతో చెలిమి వల్ల కాడన్నాది
సంకీర్ణపాలనను దుమ్మెత్తిపోసింది..
నల్లోలహక్కులు అడుగంటినంటూనే
”సొంతపార్టీమీద ధిక్కారమయ్యింది” ||లేదు||
నల్లజాతి వజ్రమమ్మా…
నువ్వు.. గాయాల నదివైతివమ్మా..
ఏటికే ఎదురీదినావు.
నువ్వు.. ఎల్లలే తుడిచేసినావు..
నల్లజాతి పోరుజెండా
నువ్వు.. గగనాన ఎగరేసినావు..
”సూర్యచెంద్రులు, చుక్కలున్నంతదాంక
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము..
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము.
ఎల్లకాలము నిన్ను గుర్తుంచుకుంటాము..
”విన్నీమండేలా”కు
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags