పూల వాసనకు హృదయం పరిమిళిస్తే!
పసిబిడ్డల నవ్వుకు మనసు నర్తిస్తే!,
‘అంబా!’ అరుపుకు మది మురిస్తే!,
కోయిల గానాలకి హృదికుసుమిస్తే!,
నదుల జలజలలకు ఒడలు పురివిప్పితే!
నీది ప్రేమించే హృదయమే
పిడికెడు మెతుకుల్లేక పక్కవాడి డొక్కమాడుతుంటే,
కప్పుకోను గుడ్డలేక గుడిసెలో వాడు ఒణుకుతుంటే,
ఆకలికి ఆగలేక అడుక్కునే పిల్లలు అరుస్తుంటే,
ముసలాళ్ళు దిక్కులేక దిగులుతో మూల్గుతుంటే,
పలకపట్టే వయసువాడు తట్టతో మట్టిమోస్తుంటే
చూసిన నీమనస్సు స్పందిస్తే నీది ప్రేమ హృదయమే!!
మమతనే నవనీతంతో మనస్సంతా నిండిపోవాలి.
నీకున్నది లేని వానికి కొంతైనా పంచగలగాలి!
నీ సంపాదనలో పదోవంతైనా ధర్మం చేయగలగాలి,
నీస్వార్జితం ధర్మబద్ధమైందై ఉండాలి.
నీ మనస్సు ‘అందా’ నికి స్పందించి నట్లే.
తోటి మానవుని ‘కష్టా’నికి స్పందించాలి.
అపుడే నీది ‘ప్రేమ’ హృదయం!
అపుడే నీవు ‘ప్రకృతి ప్రేమికుడివీ’
మానవత్వమున్న మనీషినీ!
నీమాతృభూమి ఆరాధకుడివీనీ.
ప్రేమ ‘ప్రేమిస్తేనే’ తెలుస్తుంది.
ప్రేమ ‘మానవసేవ’తోనే ప్రకటిత మవుతుంది.
ప్రేమంటే కామమూ కాదు, మోహమూకాదు,
తోటివారిని తన వారనుకోడమే ప్రేమ తత్వం
మనస్సున్న ‘మానవత్వం’! – మమత వర్షించే ‘అమృత భాండం’ !!
-
Recent Posts
- ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
- తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
- సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
- తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
- వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు – డా. సమ్మెట విజయ
Recent Comments
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
