లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
ఎప్పుడు చూడు సర్దుకుపోవాలి
ఎక్కడ చూడు మౌనం వహించాలి
ఎక్కడా లేదు సమానత్వము
ఎప్పుడు వస్తుంది స్వేచ్ఛ స్త్రీలకు
తలుపులు తెరుచుకొని వచ్చింది
మహిళా దినోత్సవము
రెక్కలొచ్చిన పక్షిలా ఎగురుదాము
ఇప్పుడు చూడు స్త్రీ శక్తిని
ఇప్పుడు చూడండి స్త్రీల అభ్యున్నతి
ఎప్పుడూ గౌరవిద్దాము స్త్రీని
సమానత్వ సమాజంలోకి అడుగుపెడదాము
– వి. వంశీకృష్ణ, 8వ తరగతి