మల్లెపువ్వంటి మానసిక అందాల మగువ
బాధల కుంపటి నుండి గాధల సంపుటికి ఎగిసిన తెగువ
ఒకప్పుడు వంటింటి వస్తువైన వనిత
నేడు లోకాన్నేలే పరాక్రమ చకిత
ఆత్మగౌరవమే అలంకారముగా చేసుకున్న స్త్రీ
సాహసమే ఊపిరిగా ఎగురుతున్న విహంగమైంది చూడు
అంతటా ఆకాశమై విస్తరించిన ఆమె
అడుగుపెట్టని రంగం లేదీనాడు
సంప్రదాయాలచాటు నలిగిన అస్తిత్వమిప్పుడు
గుప్పెడు నవ్వుల సీతాకోకై రంగులీనింది
male ego బానిసత్వపు సంకెళ్ళు తెరిచి
తనలోని Emotional Bondage విలువను పెంచుకొంది
ఆర్థిక స్వాతంత్య్రపు ఆలంబనతో మరో చరితకు శ్రీకారమైంది
విశ్వమంత విశాలమైన ఆమె ప్రేమ
తనకేమీ మిగుల్చుకోకున్నా… వాడిన పువ్వుగా పరిమళిస్తుంది
ఆమెలోని అద్భుతాన్ని తూచే తూనీకేదీ లోకంలో
ఆమె ఉన్నతికి సరిహద్దులే ఒద్దికగా తొలిగిపోతుంటే…