ఎడిటర్ గారికి,
అయోడైజ్డ్ ఉప్పు తప్ప సాధరణమైన ఉప్పు మార్కెట్లో లభించడం లేదు. ముందు ఉప్పు మూట పెట్టుకుని చిరువ్యాపారులు వీధుల్లో గొంతెత్తి అరుస్తూ విక్రయించేవారు. శుక్రవారం నాడు ఉప్పు కొంటే లక్ష్మి మనింట్లో వాసం ఉంటుందని శుక్రవారం ఉప్పు కొనని ఇల్లాళ్ళు ఉండరు. వీళ్ళను మళ్ళీ మార్కెట్లో నిబెట్టుకునేలా చేయడం మనందరి కర్తవ్యం. సాధారణ ఉప్పుకి మళ్ళీ మార్కెట్ని కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఒక భాగం.
– గౌరి ఇమెయిల్