తీర్చిదిద్దిన పుస్తకం
పుస్తకము అను నీవు
నాలోకంలోకి వచ్చావు చూడు
అమావాస్య చీకటి వంటి అజ్ఞానం నుండి
పున్నమి వెలుగు వంటి జ్ఞానంలోకి
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు
మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు
విజ్ఞానం, విద్య, వినయం అనే
మహా సముద్రంలో పడవవై
నన్ను నడిపించి, విజయము
అనే నా లక్ష్యానికి నన్ను చేర్చి
గొప్పవాడిగా తీర్చిదిద్దావు
– జె.స్వామి, 8వ తరగతి