ఇతరుల దృష్టిలో
ఐటి ఉద్యోగులు
స్వదేశంలోనే
ప్రవాసులు!
ఒకప్పుడు మాటల్లో
ఫోన్ హ్యాంగ్ అయ్యేది
నేడు ఫోన్‌కే హ్యాంగ్ అయ్యారు
ఇదీ మార్పంటే!
కోడింగ్‌లో ఎర్రర్స్
ఎక్కువుంటే ఎర్రోడు
టెస్టింగ్‌లో తప్పించుకుంటే
బుర్ర ఉన్నోడు
ట్విట్టర్లో
పిచ్చికూతలు కనిపెట్టిందేమో
పిచ్చుక
అలిగి వెళ్ళిపోయింది!
హార్డ్వేరంటే
ఎన్నో లోహాల దేహం
సాఫ్ట్వేరంటే
ఘటనాఘటనల నిలయం