-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
Author Archives: భూమిక
శ్రామిక స్త్రీ జన చిత్రణ ‘‘దాల్చ’’! – అరణ్యకృష్ణ
ఇది ఆరుగురు అసాధారణ బహుజన మహిళల జీవితాల్ని గుదిగుచ్చి ఒక్కచోట చేర్చిన కథా సంపుటి. శ్రామిక కులాల్లోని మహిళలు సమాజంలో ఇతర వర్గాల స్త్రీలతో పోలిస్తే అసాధారణ జీవితం గడుపుతున్నట్లే మనకి అర్ధమవుతుంది ఈ కథల్ని చదివిన తరువాత.
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
నేపాలీ శబర్ శ్రమ జీవనం – ఉమేశ్ సోలంకి
అనువాదం: సుధామయి సత్తెనపలి పశ్చిమ బెంగాల్, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు నేను శబర్పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్ (సబర్ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్ బాషా
‘దళిత్’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణ కథా రచయిత్రుల విప్లవ కథ-స్త్రీ జీవిత చిత్రణ – పెద్దపల్లి తేజస్వి
సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.
Posted in వ్యాసాలు
Leave a comment
జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి
వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు మేస్త్రీల … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో ప్రముఖురాలైన భండారు అచ్చమాంబ (1874`1905), అబలా సచ్చరిత్ర రత్నమాల వంటి గొప్ప రచనలు చేసి, తను జీవించిన కాలంలోనే విద్వాంసురాలిగా, అఖండ మేధావిగా ప్రఖ్యాతి చెంది, ఎంతోమంది సమకాలీన స్త్రీలు తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికెదిగింది.
Posted in వ్యాసాలు
Leave a comment
వృద్ధాప్యం బరువై .. ఆదరణ కరువై.. – వి.శాంతి ప్రబోధ
‘ఈ అన్యాలం పాడుగానూ.. బతికు న్నన్ని ఒద్దులు ఆ తల్లి గోసబోసుకున్నరు. గిప్పుడు సూడున్రి. చావు ఎంత ధూమ్ దాం చేసిన్రో .. ‘‘అంటూ యాదమ్మ చేట చీపురు తో బయటకు నడిచింది. ఆమె ఎవర్ని ఉద్దే శించి అంటున్నదో మాకు అర్థమైంది. తల్లి దండ్రులు లక్షలు పోసి చదివించి విదేశాలు పంపిస్తుంటే, అక్కడ చదివి … Continue reading
Posted in కిటికీ
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
` అనువాదం: ప్రభాకర్ మందార 3. తీవ్ర వామపక్షం: నక్సలైట్గా నా జీవితం 1973 తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మూడు నక్సలైట్ గ్రూపులు చాలా క్రియాశీలంగా వుండేవి. ఇవి కాకుండా చిన్న చిన్న బృందాలు ఇంకా చాలానే వుండేవిగానీ అవేవీ తమను తాము పార్టీలుగా చెప్పుకునేవి కావు. పైగా అన్నింటి చివరా ‘సీపీఐ`ఎంఎల్’ అనే వుండేది. … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
శక్తి పుష్పం – డాక్టర్ ఎస్.రమేశ్
గ్రామం చివర ఉన్న చిన్న ఇల్లు. పాత కాలపు ఇటుకలతో కట్టబడిన ఆ ఇంటి ముందు పెరట్లో ఒక చిన్న మామిడి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న లక్ష్మి తన చిన్న కూతురు పద్మని ఒడిలో పడుకోబెట్టుకుని, దూరంగా అస్తమించే సూర్యుడిని చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత, నిరాశ కనిపించాయి.
Posted in కధలు
Leave a comment
సెల్వి అమ్మ: కోయంబత్తూరు బిర్యానీ మాస్టర్ – పూంగొడి మదియరసు, అక్షర సనాల్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
కోయంబత్తూర్లోని పుల్లుక్కాడు ప్రాంతంలో అందరికీ ఇష్టురాలైన ఒక వంటమనిషి చేసే బిర్యానీ చాలా ప్రసిద్ధిచెందింది. ఇది 15 మందికి పైగా ట్రాన్స్ ఉద్యోగులతో కూడిన ఒక క్యాటరింగ్ సర్వీస్.
Posted in వ్యాసాలు
Leave a comment
మా ఎల్లమ్మ ఆకాశంలో – మా మాతంగి అగాథంలో – కృపాకర్ మాదిగ
మాదిగలు చర్మకారులు. జంబూద్వీప మూలవాసులు. దక్షిణాన హిందూ మహాసముద్రం నుంచి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ దాకా చర్మకార సమూహాలు అతి పెద్ద జనాభాగా విస్తరించి ఉన్నాయి. మాదిగలు, చక్కిలియార్లు, మాద్గి, మాంగ్, మాతంగ, చమార్, జాతవ్, డక్కలి, చిందు, బైండ్ల, మాస్టి, మాదిగదాసు, ఆది జాంబవ, అరుంధతీయ, మోచి, సమగర – ఇలా అనేక పేర్లతో భారతదేశంలో … Continue reading
Posted in పుస్తక పరిచయం
Leave a comment
రైతు ఆత్మహత్యలు జరిగిన కుటుంబాల్లో మహిళలపై వ్యవస్థీకృత హింస – ఒక విశ్లేషణ – పరుచూరు జమున
‘‘భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న వ్యవస్థీకృత హింస‘‘ అనే అంశంపై పూనాలోని సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు పోయిన నెల ఆగస్టు 28, 29 తేదీల్లో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సును మహిళా కిసాన్ అధికార్ మంచ్ (MAKAM), సొసైటీ ఫర్ ప్రమోటింగ్ పార్టిసిపేటివ్ ఇకోసిస్టమ్ మేనేజ్ … Continue reading
Posted in రిపోర్టులు
Leave a comment