Author Archives: భూమిక

స్నేహమయి డి.సుజాతాదేవితో నేను – శీలా సుభద్రాదేవి

డి.సుజాతాదేవి పేరు వింటే సాహిత్య రంగంలో కొందరు ‘ఆమె బాల సాహిత్య రచయిత్రి’ అంటారు. మరికొందరు ‘గేయం రాస్తుంది’ అంటారు. తమ రచనలు తప్ప ఇతరుల రచనలు చదివే అలవాటు లేని వాళ్ళు ‘ఎవరామె? ఏమిటి రాసింది? ఎప్పుడూ పేరు విన్నట్లు లేదే?’ అని బోలెడు ఆశ్చర్యంతో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Share
Posted in నివాళి | Leave a comment

రేఖా బెన్‌ జీవితపు పడుగూ పేకా… -ఉమేశ్‌ సోలంకి / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి మోటా టింబ్లా గ్రామానికి చెందిన ఒంటరి తల్లి రేఖా వాఘేలా గుజరాత్‌కు చెందిన పటోలాతో – క్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ నేతకు ప్రసిద్ధి చెందిన చేనేత పట్టు వస్త్రాలు, ఎక్కువగా చీరలు – పాటుగా తన సంక్లిష్టమైన జీవిత కథనూ నేస్తున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

అతడు మనిషి – వి. ప్రతిమ

అవును అతడు మనిషి నిరంతర పధికుడు అంచు(తు)లు వెదికే ప్రయాణీకుడు…

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

మార్పు కోసం మంచి సినిమా – గిరిజ పైడిమర్రి

సమాజం మీద ప్రగాఢమైన ప్రభావం చూపగలిగిన మాధ్యమాలలో సినిమా అత్యంత ప్రధానమైంది. సినిమారంగం వ్యాపార ధోరణితో వెర్రితలలు వేస్తున్న సమయం. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలతో కాశ్మీర్‌ ఫైల్స్‌, కేరళాస్టోరీ లాంటి సినిమాలు కూడా వస్తున్నాయి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

బస్తీలలో ఎగిసిపడిన చైతన్యం – భూమిక టీం

మూడు దశాబ్దాలుగా భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ జెండర్‌ ఆధారిత హింసపై మన తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తుందని మన అందరికి తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం హైద్రాబాదులో, అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డ 10 బస్తీలలో స్త్రీలు, పురుషులు, కిశోర బాలబాలికలు మరియు యువతతో ఆడ వారి పట్ల, ట్రాన్స్‌ మహిళల పట్ల హింసకి వ్యతిరేకంగా భూమిక … Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

హైదరాబాదు విమెన్‌ రైటర్స్‌ ఫోరం తొలి సమావేశం – భండారు విజయ

భారతీయ పితృస్వామిక సమాజంలో ప్రాచీనకాలం నుండి స్త్రీలను తల్లులుగా, దేవతలుగా ఒకవైపు పూజిస్తున్నారని చెబుతూనే మరోవైపు వారిని రెండవస్థాయి పౌరులుగా 19వ శతాబ్దం దిగజార్చేసింది. అదే 20, 21వ శతాబ్దం వచ్చేసరికి ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబదీదారి వ్యవస్థ, స్త్రీలను అంగడి సరుకులుగా, ఆట బొమ్మలుగా మార్చివేస్తూ, వారి వ్యక్తిత్వాలను ఒకవైపు హననం చేసింది.

Share
Posted in రిపోర్టులు | Leave a comment

పిల్లల భూమిక

నాన్న ప్రేమ ఉత్తమమైనది నాన్న ప్రేమ ఉత్తమమైనది నాన్న ప్రేమ విశాలమైనది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

నిను మరువతరమా..! – నాంపల్లి సుజాత

పోతారమా.. నిను మరువతరమా..! నను కనీ, కళ్ళల్లో పెట్టుకొని పెంచి పెద్దచేసిన నిన్ను

Share
Posted in కవితలు | Leave a comment

మట్టి మనుషుల స్వాతంత్య పతాక – డాక్టర్‌ కత్తి పద్మారావు

కొండ చరియలు విరిగి పడుతున్నాయి కడలి అల్లకల్లోలమౌవుతుంది ప్రకృతి సంక్షోభంలో జీవులు

Share
Posted in కవితలు | Leave a comment

ఆగష్టు, 2024

ఆగష్టు, 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

యాంత్రికతని మనమే సృష్టించుకుంటాం – కొండవీటి సత్యవతి

పర్ఫెక్ట్‌ డేస్‌ సినిమా పేరు. ఇది జపనీస్‌ చిత్రం. విన్‌ వెండర్స్‌ దర్శకుడు. హిరయామా అనే ఒక టాయ్లెట్‌ క్లీనర్‌ కధ. కోజి యకుషో అనే నటుడు టాయ్లెట్లు శుభ్రం చేసే పాత్రలో అద్బుతంగా నటించాడు. టాయ్లెట్‌ శుభ్రం చేసే మనిషిని కథానాయకుడుగా పెట్టి విన్‌ వెండర్స్‌ ఓ కళాత్మక చిత్రం తీసాడు. కళాత్మక చిత్రం … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

వర్షాకాలం! – ఆపర్ణ తోట

కాలమ్‌ రాయాలి! రాద్దామని కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ఏం రాయాలా అని ఆలోచిస్తూ స్నేహితురాళ్ళ గుంపులో (అదేనండి వాట్సాప్‌ గ్రూపులో) సలహాలు అడిగాను.  వర్షం గురించి రాయమని రెస్పాన్స్‌. మొదలు పెట్టేశా. మిగిలిన వారు మాట్లాడేలోగా లాప్టాప్‌ కీబోర్డ్‌ మీద నా వేళ్ళు చకచకలాడాయి.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

వ్యాయామంతో ప్రయోజనాలెన్నో .. – వి.శాంతి ప్రబోధ

‘‘గిట్టయితే మా బతుకులేంగాను, మేమెట్ల బతకాలమ్మ’’ బాధ వెళ్లగక్కుకుంటూ వచ్చింది యాదమ్మ. ఏమైందన్న మా అత్తగారి ప్రశ్నకు జవాబుగా ‘‘ఆ ఉమా మేడం ఒకటో తారీకెల్లి పని బంద్‌ పెట్టమన్నది. కొలువు దిగిపో యింది కద. పనంతా ఆమెనే చేసుకుం టదట’’ దీనంగా చెప్పింది యాదమ్మ.

Share
Posted in కిటికీ | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

మా తల్లిదండ్రులు మృదు స్వభావులు. వాళ్లెన్నడూ మాపై చెయ్యెత్తింది లేదు, పల్లెత్తు మాటన్నది లేదు. ఇతరుల పట్ల.. ఇరుగుపొరుగు కావొచ్చు, ఇతర కులాలకు చెందిన పనివారు కావొచ్చు.. ఎవరి పట్లా వాళ్లు తెలిసి నిర్దయగా ప్రవర్తించింది లేదు. అయితే బ్రాహ్మణులుగా తాము ఇతరులందరికంటే అధికులమన్న భావన మాత్రం వారిలో ఉండేది.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

చీడ – గొరుసు

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

ఆధునికుల మన్ననలందిన నవల ‘‘సిద్ధార్థ’’ – డా. రాయదుర్గం విజయలక్ష్మి

సమాజ దుఃఖ నివారణ మార్గాన్వేషకునిగా ఇల్లు వదలిన గౌతమ సిద్ధార్థుడు, ఆరేళ్ళ అన్వేషణానంతరం, జ్ఞానోదయాన్ని పొంది, బుద్ధుడయ్యాడు. తాను తెలుసుకున్న సత్యాన్ని, బోధనల ద్వారా మాత్రమే గాక, ఆచరణ ద్వారా కూడా ప్రజలకు అందించాడు. అందుకే బౌద్ధం అంటే మానవులను కరుణార్ద్రచిత్తులుగా తీర్చి దిద్దగలిగిన ధర్మంగా గుర్తింపును పొందింది. నాది, మాది అన్న మాటలను మనది … Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment