-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
సమాజ అంచుల నుండి గౌరవప్రదమైన జీవనానికి: ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర – అర్చనరావు మానుకొండ
ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర అందరిలా కాదు. అది కుటుంబ అంగీకారం నుండి నిరాకరణ వరకు, ఆశ్రయం నుండి అసురక్షితత్వం వరకు, ఆత్మగౌరవం నుండి అవమానం వరకు విస్తరించే సంక్లిష్ట అనుభవాల సమాహారం. వారు ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వారి జీవనోపాధిని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తాయి.
Posted in ప్రతిబింబం
Leave a comment
“హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.
హం హైదరాబాదీ. హమేషా హైదరాబాదీ రహతీహు, మా చిన్నప్పుడు మేము, హిందూస్ అందరం కలిసి ఆడేవాళ్ళం. బోనాలు పండుగలు, దసరా పండుగలకి బొమ్మలు తీసుకురావడం, మిఠాయిలు తీసుకురావడం మేము కూడా ఆ పిల్లలతో కలిసి వెళ్లేవాళ్ళం. బోనాలు సమయంలో మేకల్ని బలివ్వడం, పూజలు చేయడం నా చిన్నతనంలో చూసేదాన్ని.
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి
వాళ్ళిద్దరివీ రెండు మార్గాలు. ఒకరు పౌరహక్కుల ఉద్యమానికి జీవితం అంకితం చేస్తే మరొకరు మహిళా హక్కుల కొరకు ఉద్యమించారు. వాళ్ళే వసంత, కన్నాబిరన్‌లు. పౌరహక్కుల నేతకు సహచరిగా, ఉద్యోగిగా, ముగ్గురు పిల్లలకు తల్లిగా, అన్నిటికీ మించి మహిళా హక్కుల కొరకు అహర్నిశలు పనిచేసిన మహిళగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా పలు సవాళ్ళను వసంత తన జీవితంలో ఎదుర్కొన్న … Continue reading
Posted in ఇంటర్‌వ్యూలు
Leave a comment
తన కష్టాలన్నింటినీ ఒక వెదురు బుట్టలో పెట్టి – కిరణ్ అడమాచే / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
బింఝ్వార్ ఆదివాసీ సముదాయానికి చెందిన మంగలీ బాయి తన జీవనోపాధి కోసం అడవిపై ఆధారపడతారు, కానీ ఆమె అడవిని ఒక వనరు కంటే ఎక్కువగా చూస్తారు. అడవితో ఆమెకున్న అనుబంధం గురించిన కథనం.
Posted in వ్యాసాలు
Leave a comment
సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ – అంబేడ్కర్ విశ్లేషణ – అనూరాధ. బి
అంబేడ్కర్ రచనలు, ప్రసంగాలలో వివిధ సందర్భాల్లో సమాజాన్ని గురించి, స్త్రీల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ‘కులాల పుట్టుక’ గురించి, ‘భౌద్ధ మతం’ గురించి, బౌద్ధ మతంపై జరిగిన ‘ప్రతీఘాతుక విప్లవం’ గురించి ‘బ్రాహ్మణ మత విజయం’ గురించి రాసిన సందర్భాలను అధ్యయనం చేస్తే వాటి ఆధారంగా భారత సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషించడానికి … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం – నామని సుజనాదేవి
‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో! భగ్గున మండిందిరో’ అంటూ ఉరిమే మేఘమై, ఉరికే ఉప్పెనై, ఊరూ వాడా ఏకమై సాధించుకున్న తెలంగాణలో, ‘సాహిత్యానికి’ ఉన్న పాత్ర చాలా విశిష్టమైనది. అంతకుముందు వరకు తెలంగాణ భాషను, యాసను కేవలం విలనిజానికి, ఒకరకంగా అవమానించే రకంగా మాట్లాడే పద్ధతికి మాత్రమే ఎన్నుకున్న తరుణంలో జరిగిన, ‘తెలంగాణ ఆవిర్భావం’ … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
వృద్ధాప్యంలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు – డా. సమ్మెట విజయ
జీవితం చరమాంకంలో ప్రతి ఒక్కరూ చవిచూసేది వృద్ధాప్యం. ఆ వయసులో కావలసింది మన అనుకున్న వారి ప్రేమ ఆప్యాయత నీకు మేమున్నాం అనే ఒక చిన్ని నమ్మకం ఇవ్వగలిగితే వారి జీవితం ఇక ప్రశాంతమే.
Posted in సమాచారం
Leave a comment
మహాతల్లి – నిర్మలాదేవి.యన్
Posted in కవితలు
Leave a comment
“మెనోపాజ్ మహిళ అంతరంగం” – వి వరలక్ష్మి
“ఏంటి ఇంకా బాలాకుమారి అనుకుంటున్నావా!?” “అమ్మమ్మ/ నానమ్మ అయ్యే వయసులో….!?” ముసుళోల్లకి ఈ దసరా పండుగలేంటో!?”
Posted in కవితలు
Leave a comment
ఉప్పొంగే ఆవేశం కాదు, చల్లబడని చైతన్యాన్ని నేను – స్వప్న కొండమడుగు
వివక్షను మోసే ఈ నేలపై సమానత్వాన్ని నాటే విత్తనం నేను నేను పుట్టింది అవకాశాలలో కాదు, నిరాకరణ గర్భంలో.
Posted in కవితలు
Leave a comment
ఇదీ సంగతి – కొండవీటి సత్యవతి
ఒకానొక సఖి సెంటర్‌కి ఒక కుటుంబ హింస బాధిత మహిళ వచ్చారు. ఆమెతో ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. కౌన్సిలర్ ఆమెను కూర్చోబెట్టి భోజనం చేసారా అని అడిగింది. లేదు అన్నారామె. భోజనం తెప్పించి ముందు తినండి తర్వాత మాట్లాడదాం అంది కౌన్సిలర్. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు గబగబా తింటున్నారు. ఆమె కళ్ళ నుండి … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
గర్భసంచి మహిళలకి లైఫ్ లైన్ – పి. ప్రశాంతి
‘పండగలంటే పల్లెటూళ్ళలోనే చూడాలి. మరీ ముఖ్యంగా దసరా పండక్కి తెలంగాణా పల్లెల్లో రకరకాల పూలతో బతుకమ్మల్ని చేసి అందమైన ఆటపాటలతో సాగానంపడం చూడాల్సిందే. ఆంధ్రా పల్లెల్లో అయితే సంక్రాంతి పండక్కి నెల ముందునించే ముంగిళ్ళలో ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెడ్లు, హరిదాసులు…. చెప్పడం కాదు చూసి తీరాల్సిందే’ పరవశంగా చెప్పుకు పోతున్నాడు నరేంద్ర.
Posted in పచ్చి పసుపు కొమ్ము
Leave a comment
‘నో’ చెప్పడం తప్పు కాదు – అపర్ణ తోట
ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ముగించాక, ఒక అమ్మాయి నన్ను దొరకబుచ్చుకుని “పెళ్లి తరవాత కుటుంబంలో మగస్వామ్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?” అని అడిగింది ఒక అమ్మాయి. ఒక పాతికేళ్ళు ఉండవచ్చు. ఇంకా పెళ్ళికాలేదన్నది. సూటిగా అడిగిన ఈ ప్రశ్న నాకు కాస్త ఆశ్చర్యాన్ని ఆలోచనను ఇచ్చింది. ఇంత మౌలికమైన, బలమైన ప్రశ్న … Continue reading
Posted in బోగన్ విల్లా
Leave a comment
తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
గత రెండు నెలలుగా తెలుగు టెలివిజన్, సోషల్ మీడియా, సినిమా పెద్దలు, తెలుగు మహిళలు ఎలా ఉండాలని జరుపుతున్న చర్చలో తెలుగు మగవాళ్ళు చాలా ఉత్సహంగా ఆడవాళ్లు స్వేచ్చని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ఎలా వాళ్ళని నియంత్రణ చెయ్యాలో, ఏ బట్టలేసుకుంటే గౌరవించాలో, లేకుంటే ఎలా తన్ని తరిమేయ్యలో కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో వీళ్ళందరూ బోట్స్ … Continue reading
Posted in ఇంకు పెన్ను
1 Comment
