-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: కొండేపూడి నిర్మల
గాంధారి లోకంలో శ్రీలేఖ పోరాటం
కొండేపూడి నిర్మల చాలా రోజుల నుంచీ మీకు శ్రీలేఖ గురించి చెప్పాలనుకుంటున్నాను. దాదాపు పదిహేనేళ్ల క్రితం ”శావీ” అనే ఆంగ్ల పత్రికలో ఆమె ఆత్మకథ చదివి దాచుకున్నాను. ఆవిడ ధైర్యం, ఆత్మవిశ్వాసం లాగే సంఘర్షణ కూడా నన్ను వెంటాడుతూ వుంటుంది. కేరళ పోలీసు శాఖలో మొదటి తరం మహిళా అధికారి శ్రీలేఖ. నేరస్థుల పాలిట సింహ … Continue reading
Posted in మృదంగం
Leave a comment
క్రోమోజోముల్ని కంగాళీ చేసే భావజాలం
మొన్న వెబ్సైటులో ఏవో వ్యాసాలు చూస్తూ పోతున్న నన్ను ఒక యువకుడి వాస్తవ గాధ కట్టి పడేసింది. ప్రస్తుతం నేను పనిచేస్తున్న థర్డు జండరు ప్రాజెక్టుకి దగ్గరగా వుండటంతో ఆసక్తి కొద్దీ వెంటనే అనువాదం చేసాను. ఆ కధ ఇలా మొదలయింది.
Posted in మృదంగం
Leave a comment
సమాచార విప్లవం ఎవరి కోసం?
“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించి సీట్లలో వారినే కూచ్చోనిద్దాం” అనడానికి, జేబులు కొట్టకపోవడం మన సంప్రదాయం. ఎవరి జేబులో పైసలు వారినే ఖర్చు పెట్టుకోనిద్దాం – అనడానికి ఆ దృష్టిలో ఏమి తేడా లేదు. అంటే హక్కుల్నీ, సమస్యల్ని ఆదర్శం తోనో, భావజాలానికి సంబంధించిన మాయాజాలంలోనో దక్కించుకోగలమని మనం ఇంకా నమ్ముతున్నామా?
Posted in మృదంగం
Leave a comment
పెళ్ళి అనబడు రాచముష్టి కీడ్ర
– కొండేపూడి నిర్మల ”మొగుడు” కాని వాడ్ని మొగుడుగా ఊహించి ఇంద్రుడివి, చంద్రుడివి అని పొగడ్డం కష్టంగా వుందక్కా….” అంది పొద్దున్న మా పిన్ని కూతురు చాటింగులో. రాజేశ్వరికి నెల్లాళ్ళ క్రితమే ఒక పెళ్ళి సంబంధం చూశారు. చూపులకి తల్లి, తమ్ముళ్ళు, దూర బంధువులుకూడా వచ్చారు. పిల్ల బావుందని వెంటనే చెప్పారు. నాన్చడం తమకు ఇష్టం … Continue reading
Posted in కథలు
Leave a comment
నా సంతోషం సొరకాయకూర వండడంలో లేదు సూర్యోదయంలో వుంది
వంట చెయ్యడమంటే నాకు పరమ చిరాకు. దాన్నొక వృత్తిగా మలచి విశ్వవిద్యాలయాలు నడిపిస్తూ ఏటేటా వేలాది మంది సంస్థాపరమైన వంట నిపుణుల్ని దిగుమతి చేస్తున్నా సరే అవి నాకేమాత్రం ఆసక్తిని కలిగించలేకపోయాయి. మూడు తరాల ఆడపిల్లలు కలలు కన్న ఎయిర్ హోస్టెస్ (గగన సఖి) ఉద్యోగం కూడా వంటకి అనుబంధమైన వడ్డన వుండటం వల్లనే అనాకర్షణీయంగా … Continue reading
Posted in వ్యాసాలు
2 Comments
హెచ్.ఐ.వి హైకూలు
మూడో పప్రంచ యుద్ధం సూదితో మొదలైందా! నెత్తుటి బొట్టు నుంచున్న పళాన ఒణికిస్తోంది కొమ్ములతో కోరలతో భయపెట్టే పాతకాలంవాడు కాదు ఈ శతువ్రు జలుబుతో దగ్గుతూ క్షీణించిన కొద్దీ భయపెడతాడు
స్త్రీలకొక ప్రాంతీయ అస్తిత్వం వుందా?
నిన్న విశాఖ నుంచి మల్లేశ్వరి అనే లెక్చరర్ ఫోన్ చేసింది. “కోస్తా ఆంధ్రా స్త్రీల గురించి తెలంగాణా వాదులు ఏదేదో అసహ్యంగా మాట్లాడుతున్నారుట కదా మీ దాకా రాలేదా?” అంది. “… ఏమో రాలేదు. వచ్చినా ఆశ్చర్యపోను. ఎందుకంటే భారీ ఎత్తున ఒకసారి ఆశ్చర్యపోయి గట్టిగా నాలుగేళ్ళూ కాలేదు.
రాచబాటమీది దొంగాటని దెబ్బకొట్టాలి
ఆ మధ్య పూనాలో జరిగిన అంతర్జాతీయ రచయితల సదస్సులో తెలుగునుంచి రచయిత్రుల్లేరు. వేదికమీద చేతులు కలుపుకుని జేకొట్టిన తెలంగాణా ఉద్యమ రథసారధుల్లో ఆడవాళ్ళు లేరు. బెంగుళూరులో జరిగిన జాతీయ సమ్మేళనంలో తెలుగు కవయిత్రుల్లేరు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ విలేఖరుల గోష్టిలో తెలుగునుంచి కె. సత్యవతి తప్ప మరే మహిళా జర్నలిస్టుల్లేరు.
Posted in వ్యాసాలు
Leave a comment
నూరుశాతం విజయాల్లో నూటొక్క సందేహాలు
సెక్స్ వర్కర్ అనగానే మనకు స్త్రీలే గుర్తొస్తారు. కాబట్టి నీతులు, జాగ్రత్తలు, బాధ్యతలు, మందులు, ఆకస్మిక మరణాలు అన్నీ త్రేతాయుగం నాటి దృక్పధంతోనే నడుస్తాయి. సెక్స్ అంటే కనీసం ఇద్దరు ఇంకా ఎక్కువమంది పురుషులు భాగస్వాములుగా వుంటారని, రాకెట్ ఆధిపత్యం మొత్తం మెజారిటీ పురుషుల చేతిలోనే వుందని అలవాటుగా మర్చిపోతాం. కాబట్టి రబ్బరు తొడుగులతో సమస్య … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
మాటల్లో కనిపించని మీటలున్నాయి
మాట్లాడే ప్రతిమాట వెనకా, మన దృక్పధం కనిపిస్తుంది. నామిని అని నాకో మంచి రచయిత మిత్రుడున్నాడు. ‘‘ఏంసార్ ఏంటి సంగతులు’’ అని తన ధోరణిలో చాలా అభిమానంగా పలకరిస్తాడు. ఈ సార్ అనే పదానికి జండర్ లేదు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని పెద్దల్ని అందరికీ సంబంధించిన ఉమ్మడి పిలుపు అది.