Category Archives: అనువాదాలు

అనువాదాలు

తారాబాయి చాల్‌ – గది నంబర్‌ 135

– సుధా ఆరోరా అనువాదం: ఆర్‌.శాంతా సుందరి (హిందీ మూలం) ఆమెకు పిల్లలు లేరు. ముప్ఫై ఎనిమిదేళ్ల ఆమె భర్త చనిపోయి ఇవాల్టికి పధ్నాలుగో రోజు. స్నానంచేసి, నీళ్లతో నానిన పెట్టికోట్‌ని పిండుకుని దాంతోనే తన ఒళ్లు తుడుచుకుంటూ ఉండగా, హఠాత్తుగా ఆమె కళ్లు అద్దంలోకి చూశాయి. అద్దం మీది దుమ్ముని ఆమె తడివేళ్లతో తుడిచేసింది.

Share
Posted in అనువాదాలు | 1 Comment

ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | 1 Comment

సాంఘిక వెలిలో రచించటమంటే? – అవకాశాలు, సవాళ్ళు, సంకటాలు !

– భామ (అనువాదం : ఓల్గా) సాంఘిక వెలికి గురైన గ్రూపుకి చెంది అలా వెలికి గురైన వారి గురించి మాత్రమే రాస్తున్న నాకు రచయిత్రిగా ఎలాంటి అవకాశాలున్నాయి, ఎలాంటి సవాళ్ళను, సమస్యల నెదుర్కుంటున్నాను అనే విషయం గురించి ఆత్మ పరిశీలన చేసుకునేందుకు ఆహ్వానించినందుకు విమెన్స్‌ వరల్డ్‌ వారికి ధన్యవాదాలు.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

విప్లవం మధ్యలోంచి రాయటం

మంజుశ్రీ థాపా (నేపాల్‌) అనువాదం: ఓల్గా 2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

దాడుల నేపధ్యంలో రాయటమంటే

– ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా) నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా … Continue reading

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment

అద్దం

– సుజాతా చౌదరి ఎవరన్నారు సీతకి అద్దం చాలా అవసరమని? అద్దం లేకుండా ఆమె బతకలేదని?

Share
Posted in అనువాదాలు, కవితలు | Leave a comment

హెచ్ఐవిలోనూ లింగవివక్ష

(అనువాదం- వనజ) పాజిటివ్ మహిళల దీనస్థితి హెచ్ఐవి / ఎయిడ్స్ పై ప్రపంచం యావత్తూ స్పందించిన 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ వ్యాధి ఎందుకు ఇంకా పెరుగుతూనే వుంది? హెచ్ఐవి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎందుకు వేగంగా పెరుగుతోంది? అసమానత, నిరాదరణ, తిరస్కారాల్లో కూరుకుపోయిన ఈ సమస్యని పరిష్కరించడమెలా?

Share
Posted in అనువాదాలు, వ్యాసాలు | Leave a comment