విశ్వ స్తీ మూర్తుల పేమ్రిక
తరాల నుండి అతివల ఆవేదనను ఓపిగ్గా ఒడిసిపడుతున్న ‘‘భూమిక’’
ఎల్లలు చెరిపి చెరగని చరిత్ర సృష్టిస్తున్న ‘‘విశ్వ స్త్రీ మూర్తుల ప్రేమిక’’
మహిళలు సాధించిన అపురూప విజయాలు అందించే ‘‘పసిడి జ్ఞాపిక’’
అనాగరికంలో ప్రశ్నార్థకమై మగ్గిపోతున్న జీవితాల్లో ‘‘ఆనందాల కేళిక’’
అజ్ఞాత తిమిరాల్లో పోరాడుతూ విచ్చుకున్న గళాల ‘‘మానస దీపిక’’
అన్యాయంపై కదంతొక్కే భావుకతకు మద్దతిస్తున్న ‘‘అభ్యుదయ మాలిక’’
సమాజంలో కటికాంధకారాన్ని రూపుమాపే ‘‘ఇంతుల జ్యోతిక’’
పసిమొగ్గల కళను లోకానికి చాటిచెప్పిన ‘‘లేలేత కలాల వేదిక’’
స్త్రీవాదనే ప్రచారంగా ప్రపంచ పత్రికా చరిత్రలో నిలిచిన ‘‘మణితునక’’
నీకెదురు లేదిక…
షషష ` జి.శ్యామల