భూమిక
భూమిక అరుణోదయ పూర్ణ కలశం!
అభ్యుదయ పథాన మమ్ము నడిపిస్తూ చైతన్యపరుస్తూ,
మూఢాచారాల్ని నమ్మకాల్ని ఖండిస్తూ వెళుతోంది.
భూమిక సప్తవర్ణ హరివిల్లు శోభ!
కుల మత వర్గ జాతి వివక్ష లేని,
సకల స్త్రీల సమ్మిళిత సమాహార సంఘటితం!
భూమిక ఒక జీవనది!
ఎల్లవేళలా ఎల్లకాలం,
నిస్సహాయులకు సహకారం, చేయూతనందిస్తూ పయనిస్తుంది.
భూమిక చల్లని జాబిల్లి!
వెన్నెల చెలులు ప్రసరించేది,
అందించేది సమాజహిత జ్ఞాన కిరణాల్ని!
భూమిక ఉప్పొంగే సాగరం!
స్త్రీల నిర్వేదనల్ని భయకంపితాల్ని అయోమయాల్ని
తనలో బడబాగ్నిలా దాచుకొని,
చెలియలికట్టను దాటక అందరికీ అభయాన్నిస్తూ రక్షిస్తోంది.
భూమిక విరిసిన ఎర్ర మందారాల పొద!
వివక్షను లైంగిక వేధింపులను ఖండిస్తుంది.
అత్యాచార బాధితులకు అండ!
విజృంభించి వెంటాడి వేటాడుతుంది నేరస్థులను!
భూమిక మధుర గానాల వేణువు పిలుపు!
ఆర్తులకు స్ఫూర్తినిచ్చి సేవలందించే చెలుల,
నందనందన ఆనంద బృందావనం.
షషష ` రమాదేవి చేలూరు
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags