భూమిక అనే ఈ శబ్ధం ఒక్కోక్కరిలో ఒకో విధంగా ఆలోచింపచేస్తది, ఆహ్వానిస్తుంది, భయపెడుతుంది. ఓదార్పునిస్తుంది. కొత్త ఆలోచనలకు ఆస్కారమిస్తుంది.
అయితే నేను భూమికతో ప్రయాణం మొదలుపెట్టిన తరువాత నేను అమితంగా ఇష్టపడినది, పూర్తిగా ఆలమానకలు అయ్యింది, చాలా నేర్చుకున్నది చంచల్‌గూడా జైలు ములాఖత్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో జైలులో ఉన్న తల్లిని పిల్లలతో కలిపే కార్యక్రమం. స్టేట్ హోమ్ నుండి, ఇతర హోమ్‌ల నుండి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుండి అనుమతి తీసుకుని వారిని తల్లిదగ్గరకు తీసుకువెళ్ళే క్రమంలో ఎన్నో ఆలోచనలు ఇప్పుడు ఈ పిల్లలు ఆ తల్లితో ఏం మాట్లాడుకుంటారు, ఆ తల్లి ఎలా వీళ్ళను ఓదార్చుతుంది. ఎన్నో ఆలోచనలతో వెళ్ళిన తరువాత మొదటగా దుంఖః, మద్యలో ఒకరిని ఒకరు ఓదార్చుకోవడం మళ్ళీ చివరలో దుంఖః. మరలా వారిని తీసుకుని వారి వారి హోమ్‌లలో దించడం. ఈ మొత్తం విషయాలు జోరీగల్లాగా మనసును తోలిచి వేయడం మరలా కోన్నాళ్ళకు ఇదే కార్యక్రమం ఇలా జైలు ప్రాజక్టులో ఎన్నో అనుభవాలు. ఆత్మకు, వృత్తికి సంబంధించిన తృప్తి, మానవతకు, వృత్తి ధర్మానికి ఎంత వరకు న్యాయం చేసాము అనే ప్రశ్నలు.
భూమిక ఇలా ఎన్నో వసంతాలు జరుపుకోవాలి.
`