భూమిక సంపాదకులు కె సత్యవతి గారికి నమస్కారం!
మార్చి నెల సంచికలో ట్రాన్స్ జెండర్ గురించిన వ్యాసం వివరాలతో చక్కగా వుంది. నేను నా కథలలో వీరి గురించి ప్రస్తావించాను. “ఆశయాల హారివిల్లు” అనే గొలుసు కథలు 9 మంది కలసి వ్రాశాము.
అందులో నా వంతుగా వీరి గురించి వ్రాసాను. ముఖ్యంగా వీరు వెకిలిగా వుండక డిగ్నిఫైడ్‌గా వుండటం నేర్చుకోవాలి. అప్పుడే సమాజం వీరిని నమ్ముతుంది, గౌరవిస్తుంది. “కొత్తిమీర తేల్చేసింది” కథలో కుక్కకాటుకు చెప్పుదెబ్బ లాగ బాగ చెప్పింది ఆ ఇంటి కోడలు. కాకపోతే ఏమిటంట… వూరుకుంది కదా అని ఇష్టమచ్చినట్టు అంటుంటే ఎంతకని భరిస్తారు ఎవరైనా…
– మంగళ కందూర్
…. ఙ ….
