శ్రీమతి దర్భా భాస్కరమ్మ గారితో నా అనుబంధం ఒక మధుర జ్ఞాపకం – శంభు ప్రసాద్

సుమారు మూడు దశాబ్దాల క్రితం నేను సంగీత దర్శకుడిగా చురుకుగా పనిచేస్తూ, అనేక భక్తి గీతాల ఆల్బమ్‌లకు సంగీతాన్ని అందిస్తున్న రోజులు. నా తండ్రికి స్వామి రామానంద గారితో పరిచయం ఉండేది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక ఆశ్రమంలో నివసించే స్వామీజీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు మా ఇంట్లోనే బస చేసేవారు.

నా పాటలు విని, ఎంతో ఇష్టపడి, నాపై ఎంతో ఆప్యాయత చూపించేవారు. ఒకరోజు స్వామి రామానంద గారు ‘హైమవతి’ అనే పుస్తకాన్ని నాకు ఇచ్చారు. అది ఆయన పిన్ని శ్రీమతి దర్భా భాస్కరమ్మ గారు రచించిన గ్రంథమని చెప్పారు. “దీనిని రికార్డ్ చేయడానికి ప్రయత్నిస్తావా?” అని అడిగారు. నేను వెంటనే అంగీకరించి ఆ రచనను పరిశీలించాను. దానికి ‘గిరిజా కల్యాణం’ అనే పేరు పెడదామని స్వామీజీ సూచించారు.
స్వామి రామానంద గారి ప్రోత్సాహంతో ఆ రచనను సంగీత రూపంలోకి తీసుకురావాలనే ప్రయత్నం మొదలైంది. అది పద్యకావ్యం. వివిధ రాగాలతో, సంభాషణలు-కథనాలతో, నాటకంలా సాగే విధంగా దానిని సంగీత నాటికగా మలిచారు. భాస్కరమ్మ గారి రచనా శైలి ఎంతో అద్భుతమైనది. నేను సంగీతాన్ని సమకూరుస్తున్నప్పుడు ప్రతి పదం యొక్క అర్థాన్ని, పదాలను ఎలా విడదీయాలి, వాటిని ఎలా పలకాలి వంటి విషయాలను దర్భా భాస్కరమ్మ గారు నాకు ఎంతో చక్కగా వివరించారు. ఈ కంపోజింగ్ సమయంలో నేను పలుమార్లు భాస్కరమ్మ గారిని వారి ఇంటివద్ద కలిశాను. సాహిత్య పరంగా నాకు కావలసిన చిన్న చిన్న మార్పులను కూడా ఆమె ఎంతో సానుకూలంగా అంగీకరించి చేశారు. ఈ సంగీత రూపకంలో నా తల్లి శ్రీమతి వెంకట లలితాంబ గారు, నేను, నా మిత్రులు శ్రీ మల్లంపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, శ్రీమతి కళ్యాణి గారు, శ్రీ సాగర్ గారు గానం చేశారు. చక్కటి వాద్య విన్యాసంతో, మంచి నాణ్యతతో రికార్డింగ్ పూర్తయింది. కళాశాల అధ్యాపకులు శ్రీ భాగవతుల కుటుంబరావు గారు అందించిన వాయిస్ ఓవర్ ఈ ఆల్బమ్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రికార్డింగ్ పూర్తయిన తరువాత ఆడియో క్యాసెట్‌ను డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు విడుదల చేశారు. ఆ విడుదల కార్యక్రమంలోనే నేను దర్భా భాస్కరమ్మ గారిని చివరిసారిగా కలిసినట్లు గుర్తు.
అప్పటివరకు నేను ప్రధానంగా భక్తి గీతాలు, కథాగాన శైలిలోని రచనలకు సంగీతం అందించాను. కానీ ‘గిరిజా కల్యాణం’ నాకు ప్రత్యేకమైన అనుభవం. ఇది ఒక సంగీత నాటికగానే కాకుండా, నృత్యరూపకంగా కూడా ప్రదర్శించగలిగే విధంగా రూపొందింది. శ్రీమతి దర్భా భాస్కరమ్మ గారితో నాకు ఉన్న ఈ ఆత్మీయ అనుబంధాన్ని, ఆమె సాహిత్య స్ఫూర్తిని, ఆ మధుర జ్ఞాపకాలను పంచుకునే అవకాశం రావడం నాకు ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాను.
“గిరిజా కల్యాణం” – నా సంగీత ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మధుర జ్ఞాపకం.

Share
This entry was posted in జ్ఞాపకాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.